Nandamuri Mokshagna : హమ్మయ్య… వారసుడు వచ్చేస్తున్నాడు… వైరల్ అవుతున్న మోక్షజ్ఞ న్యూ లుక్

Nandamuri Mokshagna : నందమూరి ఇంటి నుంచి మరో వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి నటసింహం నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞ హీరో కావడానికి కావాల్సిన ఫిజిక్‌ కోసం కసరత్తులు చేస్తున్నారని, యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది.. తాజాగా మోక్షజ్ఞ న్యూ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

తన కొడుకు ఎంట్రీ గురించి బాలయ్య గతంలో ఎన్నో సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మంచి కథ , డైరెక్టర్ దొరికితే మాత్రం తప్పకుండ సినిమా చేస్తాడని చెప్పిన సంగతి తెలిసిందే.. మొదట బోయపాటి శ్రీను మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తారని కొందరు, కొత్త దర్శకుడితో వెళ్లారని మరి కొందరు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు.. ఈ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఇటు నందమూరి ఫ్యాన్స్.. అటు ఐని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

nandamuri mokshagna latest photos viral
nandamuri mokshagna latest photos viral

ఇదిలా ఉండగా .. మోక్షజ్ఞ సినిమా గురించి అప్డేట్ అయితే రాలేదు కానీ తాజాగా అతని కొత్త లుక్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. స్లిమ్‌గా, హ్యాండ్‌సమ్‌గా ఉన్న ఫొటోలను ఎక్స్‌లో షేర్‌ చేసి ‘వస్తున్నా.. మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని మోక్షజ్ఞ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ కావడంతో మోక్షజ్ఞ ఎంట్రీ దాదాపు ఖాయమైందని నందమూరి అభిమానులు ఆనందిస్తున్నారు.. అయితే ఏ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడు అనేది మాత్రం చెప్పలేదు.. అందుతున్న సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ సినిమాకు బాలయ్యే నిర్మాతగా వ్యవహరించబోతున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో నడుస్తుంది.. త్వరలోనే సినిమాను అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ ఫోటోల పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు