Nani: మహేష్ బాబు ఆలస్యం నానికి కలిసొస్తోందా..?

Nani.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని (Nani) తాజాగా వివేక్ ఆత్రేయ ( Vivek Aatreya)దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా మహేష్ బాబు (Mahesh Babu) రికార్డులను సైతం బ్రేక్ చేయబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా మార్కెట్ ని కూడా టార్గెట్ చేసుకొని మన సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కలెక్షన్స్ కూడా రికార్డ్ స్ధాయిలో వసూల్ చేస్తూ ఉండడం గమనార్హం.

Nani: Is Mahesh Babu's delay.. benefit for Nani..!
Nani: Is Mahesh Babu’s delay.. benefit for Nani..!

వన్ మిలియన్ డాలర్ వసూల్..

ముఖ్యంగా అమెరికాలో మన తెలుగు సినిమా వన్ మిలియన్ డాలర్స్ సాధించింది అంటే అక్కడ హిట్ అయినట్టే .వన్ మిలియన్ డాలర్ అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.8కోట్లు ఇటీవల వన్ మిలియన్ డాలర్ మించి మరికొన్ని సినిమాలు కలెక్ట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికాలో ఎక్కువగా వన్ మిలియన్ డాలర్ సాధించిన సినిమాల హీరోగా మహేష్ బాబు రికార్డు సృష్టించారు. ఏకంగా మహేష్ బాబు 12 సినిమాలకు ఒక్కొక్క మూవీకి వన్ మిలియన్ డాలర్ పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించాయి. దూకుడు నుంచి గుంటూరు కారం వరకు అలా దూసుకెళ్తూనే ఉన్నారు మహేష్ బాబు.

మహేష్ బాబు ఆలస్యం నానికి ప్లస్ అవుతోందా..

ఇకపోతే మహేష్ బాబు తర్వాత నానినే ఎక్కువ వన్ మిలియన్ డాలర్స్ సాధించిన చిత్రాల హీరోగా నిలిచారు.తాజాగా రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమా కూడా నిన్నటితో అమెరికాలో వన్ మిలియన్ డాలర్ పైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇకపోతే నాని అమెరికాలో ఇప్పటివరకు మొత్తం ఏకంగా 10 సినిమాలతో వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేశారు. నాని తర్వాతే మన స్టార్ హీరోలంతా ఉన్నారు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో మహేష్ బాబు రికార్డుని నాని ఈజీగా బ్రేక్ చేస్తాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మహేష్ బాబు తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అంటే ఈ సినిమా చేయడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు సమయం పడుతుంది. అంటే కచ్చితంగా మహేష్ రికార్డును బద్దలు కొట్టేస్తారనటంలో సందేహం లేదు. మొత్తానికి అయితే అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ తో నాని ప్రతి సినిమాలో కూడా సత్తా చాటుతూ రికార్డు సృష్టిస్తున్నారు. ఏదేమైనా మహేష్ బాబు ఆలస్యం చేసే కొద్ది నాని త్వరగా రికార్డు బ్రేక్ చేస్తారంటంలో సందేహం లేదు.

- Advertisement -

హీరో గానే కాదు నిర్మాతగా కూడా

ఇక నాని సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో భాగానే కలెక్షన్స్ వస్తువులు చేస్తున్నా.. మిగతా భాష ఇండస్ట్రీలలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి . మరొకవైపు నిర్మాతగా కూడా చలామణి అవుతున్నారు నాని.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు