DoubleIsmart : పూరి సినిమాకి నార్త్ లో టూమచ్ నెగిటివిటి.. ఈ రొట్ట మాకొద్దయ్యా అంటున్న నెటిజన్లు?

DoubleiSmart : రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్ హిట్ అయిందో తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఒక ఊర మాస్ మసాలా సినిమా రావడంతో ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. పూరి ఇక కం బ్యాక్ ఇచ్చాడు అనుకునేలోపే మళ్ళీ వరుస ప్లాప్ లు అందుకున్నాడు. అటు రామ్ కూడా వరుసగా డిజాస్టర్లు అందుకోవడంతో ఇద్దరికి మరో సారి కం బ్యాక్ హిట్ అవసరమైంది. ఇంకేముంది.. తమ కెరీర్ కి మాంచి బూస్టప్ ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ ప్రకటిస్తూ డబుల్ ఇస్మార్ట్ పేరుతో టైటిల్ కూడా రిలీజ్ చేసారు. అయితే మొదట ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చినా, రిలీజ్ అయిన ప్రోమోలు, లేటెస్ట్ గా ట్రైలర్ చూస్తుంటే ఒకరకమైన డిస్సపాయింట్మెంట్ ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. ఫ్యాన్స్ ఈ సినిమాలో మరింత ఎనర్జీని ఆశించారు కానీ, ట్రైలర్ చూస్తుంటే అలా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ ఆడియన్స్ మాట ఎలా ఉన్నా… నార్త్ లో మాత్రం ఇస్మార్ట్ శంకర్ పై టూమచ్ నెగిటివిటి వినిపిస్తుంది.

North audience trolling on Double Ismart trailer

నార్త్ లో పూరి పై టూమచ్ నెగిటివిటి..

ఇక డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ నిన్న రాత్రి 8 గంటలకు రిలీజ్ చేయగా, కాసేపటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చేయగా, మొదట చూసినపుడు బాగానే ఉన్నా, ఆ తర్వాత మాత్రం రొటీన్ గా ఉందని టాక్ వస్తుంది. పైగా ఇస్మార్ట్ కి పూర్తి కాపీలా ఉందిగానీ, ఫ్రెష్ గా ఎక్కడా లేదని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లో చాలామంది ఆర్టిస్ట్ లకు లిప్ సింక్ కూడా సూట్ కాలేదని, మరి సినిమాలో అయినా సెట్ చేసారా లేదా అని కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా నార్త్ లో మాత్రం ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే పరమ రోతగా ఉందని, ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో చాలానే చూశామని, సౌత్ లో కూడా ఇలాంటి రొటీన్ మసాల సినిమాలు తీస్తారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

పూరిపైనే ఎక్కువ నెగిటివిటి..

ఇక డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ని చూసి హీరో కంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ పైనే ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఎందుకంటే రామ్ పోతినేని సినిమాలకు హిందీలో మంచి వ్యూస్ వస్తుంటాయి. అక్కడ ఆడియన్స్ కి మంచి పాజిటివిటి ఉంది. కానీ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన గత సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. పైగా వాటిని హిందీలో కూడా రిలీజ్ చేసి నెగిటివిటి మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా ‘లైగర్’ సినిమాతో పూరి జగన్నాథ్ పై బాలీవుడ్ లో నెగిటివిటి బాగానే ఉంది. ఒకప్పటి పూరి జగన్నాథ్ ఈయన కాదు. లాంటి రొట్ట సినిమాలు మాత్రం మాకొద్దయ్యా అంటూ హిందీ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ తర్వాత సినిమా ద్వారా పూరి ఏమైనా సమాధానం చెప్తాడా అనేది చూడాలి. సినిమా హిట్ అయితే అన్న నోళ్లే ప్రశంసిస్తాయి. కానీ ప్లాప్ అయితే మాత్రం పూరి చాలా విమర్శలు ఎదుర్కోక తప్పదు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు