Deputy CM Pawan Kalyan : వదినమ్మ అంటే ఎంత ప్రేమో… అక్కడ కూడా దాన్ని వదల్లేదుగా…

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోస్ లో ఒకరు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే పండగ వాతావరణం ఉంటుంది. వరుసగా ఏడు హిట్ సినిమాలు చేసిన తర్వాత పదేళ్లపాటు డిజాస్టర్ సినిమాలు పడిన పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగింది తప్ప ఏ మాత్రం తగ్గలేదు. ఒక రీమేక్ సినిమాతో ఆల్ టైం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డును పెట్టే ఘనత కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రను వహించిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan

2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించారు. పార్టీని స్థాపించిన రోజుల్లో ఒక అనుభవం ఉన్న నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ కి కావాలి అని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత 2019వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. కానీ రెండు చోట్ల కూడా ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి ఎన్నో అవమానాలు విమర్శలు పవన్ కళ్యాణ్ పై వచ్చాయి. కొంతమంది వ్యక్తిగత జీవితాన్ని కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ చేసిన మూడు సినిమాలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టార్గెట్ చేసి టికెట్ రేట్లను తగ్గించింది. అలానే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులను థియేటర్ వద్ద డ్యూటీ చేసేలా చేసింది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈసారి 21 సీట్లలో పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతి చోట భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్లో కొనసాగునున్నారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన అధికారికి సంతకాన్ని కూడా ఒక రెగ్యులర్ పెన్నుతో స్టార్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఒక విలువైన పెన్నును తమ వదినమ్మ అయినా సురేఖ గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ పెన్నుతో మాత్రం ఫైల్స్ పైన మొదటి సంతకం చేశారు. దీనిపై చాలామంది పవన్ కళ్యాణ్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు