BiggbossNewCaptain: బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా ప్రియాంక!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవిక్షన్ పాస్ టాస్క్ పూర్తైన తర్వాత ఆ వెంటనే కెప్టెన్సీ టాస్క్ మొదలైందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో బిగ్ బాస్ లో అందరు ఇంటి సభ్యులు ఒకేసారి పాల్గొనగా ముందుగా రతిక మొదలుకొని ఒక్కొక్కరుగా కెప్టెన్సీ టాస్క్ నుండి ఓడిపోయి బయటికి వస్తున్నారు. అయితే ఈ టాస్క్ లో ఫైనల్ గా నలుగురి మధ్య గేమ్ జరిగింది. అర్జున్, ప్రశాంత్, అమర్, ఇంకా ప్రియాంక ఈ నలుగురి మధ్య ఫైనల్ టాస్క్ జరగగా, ముందుగా ఈ టాస్క్ నుండి ప్రశాంత్, అర్జున్ ఓడి బయటికి వచ్చేసారు.

ఆ తర్వాత ఫైనల్ గా ప్రియాంక అమర్ మధ్య జరగగా, ఈ టాస్క్ లో అమర్ దీప్ చివరివరకూ పోరాడాడు. అయితే టాస్క్ మధ్యలో అమర్ దీప్ కెప్టెన్ కావాలని, వదిలేయమని పిచ్చిగా అరవడం కొంచెం ఓవర్ గా అనిపించింది. ఏది ఏమైనా ఈ టాస్క్ లో ప్రియాంక విన్ అయ్యి, కొత్త కెప్టెన్ అయింది.

అయితే ప్రియాంక తన ఆటతో ఎప్పుడో కెప్టెన్ కావాల్సింది. ఏది ఏమైనా ఇప్పుడు కెప్టెన్ గా తన బాధ్యతలు ఎలా ఉంటాయో చూడాలని హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టాస్క్ లో అమర్ దీప్ ఓడిపోయాక కూడా చాలా సేపు పిచ్చిగా అంగీకరించలేకపోయాడు. అయితే ప్రియాంక వచ్చి మాట్లాడడంతో లైట్ తీసుకున్నాడు. ఇక కెప్టెన్ అయ్యే సరికి ఈ వారం ప్రియాంక సేఫ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఈ వారం కెప్టెన్ గా తన బాధ్యతలు నెరవేర్చినందుకు శివాజీ, ఎవిక్షన్ పాస్ అయినందుకు యావర్ కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు