Mr. Bachchan VS Double Ismart : పూరి జగన్నాథ్ VS హరీష్ శంకర్.. విన్నర్ ఎవరు?

Mr. Bachchan VS Double Ismart : సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి పండగ వస్తుందంటే సినిమాలు విడుదల కూడా ఎక్కువే.. సంక్రాంతి తర్వాత సమ్మర్ సినిమాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఈ సారి ఆగస్టు 15 న విడుదల కాబోతున్న సినిమాల పై జనాలు కాస్త ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఆరోజున ఎక్కువ సినిమాలే విడుదల అవుతున్నాయి.. కానీ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆగష్టు సినిమాల వార్ లో గురు, శిష్యులు పోటి పడబోతున్నారు. పూరి జగన్నాథ్ vs హరీష్ శంకర్ లో విన్నర్ ఎవరు అనే దానిపై నెట్టింట చర్చలు మొదలయ్యాయి.

డబుల్ ఇస్మార్ట్…

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ( Puri Jagannath ), రామ్ పోతినేని(Ram Pothineni) కాంబోలో విడుదల కాబోతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా పై టీమ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి టాక్ ను అందుకుంది. దాంతో ఈ సినిమా పై ఇండస్ట్రీలో అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆగష్టు 15 న ఈ సినిమా విడుదల కాబోతుంది.

మిస్టర్ బచ్చన్…

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Sankar), మాస్ మహారాజా రవితేజ(Raviteja) కాంబోలో రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్.. ఈ సినిమా పై రవితేజ ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది వచ్చిన సినిమాలు నిరాశ పరిచయాయి. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఆగస్టు 15 బరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

- Advertisement -

పూరి జగన్నాథ్ Vs హరీశ్ శంకర్..

Puri Jagannath VS Harish Shankar.. Who is the winner?
Puri Jagannath VS Harish Shankar.. Who is the winner?

పూరి జగన్నాథ్ శిష్యుడు హరీశ్ శంకర్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు ఆగస్టు 15 న విడుదల కాబోతున్నాయి. ఇద్దరు కూడా మాస్ డైరెక్టర్స్ కావడం, స్టార్ హీరోలతో సినిమాలు కావడంతో వీటిపై జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ సినిమాల హీరోలు రామ్ పోతినేని, రవితేజా ఈ సినిమాలతో హిట్ కొడితేనే నెక్స్ట్ కేరీర్ పీక్స్ లో ఉంటుంది. లేదంటే మాత్రం నెక్స్ట్ సినిమాలు రావడం కష్టమే. లైఫ్ అండ్ డెత్ సమస్యగా మారింది. ఈ రెండు సినిమాల నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ జనాలను అలరించాయి. మరి ఎవరి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుందన్న విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రెండు సినిమాలు గట్టి పోటీని ఇస్తున్నాయి. అయితే పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ పై కాస్త నెగిటివ్ టాక్ కూడా నడుస్తుంది. కానీ హరీష్ శంకర్ సినిమాకు మాత్రం ఎటువంటి అడ్డంకులు లేవు. అందులో రవితేజ సినిమా కావడంతో టాలీవుడ్ లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది.. మొత్తంగా చూసుకుంటే శిష్యుడే విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ అభిప్రాయం పై రేపు స్పష్టత రాబోతుంది. ఇద్దరి సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవాలని Filimfy కోరుకుంటుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు