Samantha: చైతూ పై ప్రేమను మర్చిపోలేక పోతున్న సామ్.. పోస్ట్ వైరల్..!

Samantha.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సమంత (Samantha ) గడిచిన కొన్ని నెలలుగా సినిమాలకి దూరంగానే ఉంటుంది. ముఖ్యంగా నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల తర్వాత సమంత జీవితం చాలా మలుపు తీసుకుంది. ముఖ్యంగా మయోసైటిస్ వ్యాధితో ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి ఇతర దేశాలలో కూడా సమంత చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమా ఈవెంట్స్ కి , అవార్డు ఫంక్షన్ లకు పాల్గొంటూ ఉంటోంది. చివరిగా విజయ్ దేవరకొండ (Vijay devarakonda)తో కలిసి ఖుషి (Khushi)చిత్రంలో కనిపించింది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది.

Samantha: Sam can't forget her love for Chaitu.. Post viral..!
Samantha: Sam can’t forget her love for Chaitu.. Post viral..!

నిర్మాతగా మారిన సమంత..

ఈ సినిమా తర్వాత మళ్లీ ఏడాదికాలం ఇండస్ట్రీకి దూరమైన సమంత ఇప్పుడిప్పుడే నిర్మాతగా మారి.. తన సొంత బ్యానర్ పైనే “మా ఇంటి బంగారం” అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నది సమంత. ఇకపోతే సోషల్ మీడియాకే పరిమితమైన ఈమె.. ఇటీవల ఒక ఈవెంట్లో పాల్గొనగా.. ఈమెను చూసి అందరూ షాక్ అయ్యారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన సమంత, ఇప్పుడు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ అభిమానులు సైతం వాపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ నిత్యం ఇన్స్టా స్టోరీస్ లలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇన్స్టా స్టోరీస్ లో మోటివేషన్ కోట్స్ షేర్ చేసింది సమంత.

ప్రేమంటే త్యాగం..

అందులో.. “ప్రేమంటే త్యాగమంటూ”.. ఒక ఎమోషనల్ పోస్టుని రాసుకుంది. చాలామంది వ్యక్తులు.. స్నేహామైనా రిలేషన్షిప్ లో అయినా ఇద్దరి అంగీకారం వుండాల్సిందే.. అందుకు ఈ విషయాన్ని తాను కూడా అంగీకరిస్తాను అంటూ తెలిపింది. కొన్నిసార్లు మీరు ప్రేమ ఇవ్వండి నేను ఇస్తానని చూపించినా కూడా.. అవతలి వ్యక్తి ప్రేమ ఇచ్చే స్థితిలో లేనప్పుడు.. మనం కూడా ఈ విషయాన్ని తెలుసుకునే లోపు.. కొన్ని సంవత్సరాలు అవుతుంది అంటూ తెలిపింది. అయితే ప్రేమ ఇవ్వడం అనేది ఎదుటి వ్యక్తి నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు అదంతా పూర్తిగా మారిపోయింది. ప్రేమ అంటే ఒక త్యాగం కాదు ఒక సీజన్ కోసం ఉపయోగించే చిట్కా లాంటిది అంటూ తెలిపింది సమంత.

- Advertisement -

చైతూని మర్చిపోలేకపోతున్న సమంత..

ఇక సమంత ఈ కొటేషన్ షేర్ చేయడంతో ఈమె నాగచైతన్య పై ప్రేమను చంపుకోలేకపోతోందా..? తాను ప్రేమను పంచాలని చూసినా, నాగచైతన్య ఈమె ప్రేమను తీసుకోలేకపోయారా అంటూ అభిమానులు రకరకాలగా కామెంట్లు చేస్తున్నారు.

స్లిమ్ లుక్ లోకి మారిపోయిన సమంత..

ఇటీవల సమంత ముంబైలో జరిగినటువంటి ఒక అవార్డు ఈవెంట్లో కనిపించగా, సమంతను స్లిమ్ లుక్ లో చూసి ఆందోళన చెందుతున్నారు. మళ్లీ సమంతకు ఏమయ్యింది..? ఏదైనా అనారోగ్య సమస్యలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత సిటాడెల్ నటించిన వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan)కూడా నటించారు. ఇటీవలే టీజర్ ని కూడా విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు