Saripodhaa Sanivaaram : సరిపోదా శనివారం టైటిల్ ఛేంజ్… నాని షాకింగ్ డెసిషన్

Senior Actor : గత ఏడాది రెండు హిట్లు అందుకున్న నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది ఇంకా బాక్స్ ఆఫీసు ఖాతా తెరవలేదు. వరుస పాన్ ఇండియా సినిమాలు థియేటర్లకు క్యూ కడుతుండడంతో తన నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడానికే చాలా టైమ్ పట్టింది. ప్రస్తుతం నాని చేస్తున్న సరిపోదా శనివారం మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నని అభిమానులకు ఓ అలర్ట్. తాజాగా ఈ మూవీ టైటిల్ ను ఛేంజ్ చేశారు. మరి మేకర్స్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే?

సరిపోదా శనివారం టైటిల్ ఛేంజ్

ప్రస్తుతం తన తదుపరి భారీ పాన్-ఇండియన్ చిత్రం సరిపోదా శనివారం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అంటే సుందరానికి తర్వాత నాని వివేక్ ఆత్రేయతో కలిసి చేస్తున్న రెండో చిత్రం ఇది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ నాని సరసన మరోసారి కథానాయికగా నటిస్తోంది. గ్యాంగ్ లీడర్ లో ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు మంచి మార్కులు పడ్డ సంగతి గుర్తుండే ఉంటుంది మూవీ లవర్స్ కు. గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ఆర్‌ఆర్‌ఆర్‌ను నిర్మించిన బడా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సరిపోదా శనివారం మూవీని నిర్మిస్తోంది. జేక్స్ బిజోయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 2024 ఆగస్టు 29న విడుదల కానుంది.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సరిపోదా శనివారం మూవీ టైటిల్ ను మేకర్స్ ఛేంజ్ చేశారు. దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ టైటిల్ ను తెలుగు వెర్షన్ లో మార్చారని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. తెలుగులో ముందు నుంచి అనుకున్నట్టుగా సరిపోదా శనివారం అనే టైటిల్ తోనే మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తెలుగులో తప్ప మిగతా భాషల్లో సరిపోదా శనివారానికి బదులుగా సూర్య సాటర్ డే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం హిందీ, మలయాళం, తమిళం, కన్నడ వెర్షన్‌లలో ఇదే టైటిల్ ను వాడబోతున్నారు.

- Advertisement -

టైటిల్ ను ఎందుకు మార్చారంటే?

సరిపోదా శనివారం అనేవి పూర్తిగా తెలుగు పదాలు. కాబట్టి తెలుగు ప్రేక్షకులకు టైటిల్ గురించి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కానీఇతర భాషలలో ఈ టైటిల్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు. అందుకే మేకర్స్ ఈ చిత్రానికి భాషలను బట్టి వేర్వేరు టైటిల్‌లను ఎంచుకున్నారు. సూర్య సాటర్ డే అనే టైటిల్ అయితే అన్ని భాషల ప్రేక్షకులను అర్థం అవుతుంది. పైగా ఈ సినిమాలో శనివారాల్లో మాత్రమే దూకుడు ప్రదర్శించే హీరో సూర్య పాత్రను నాని పోషించాడు. ఇలా రెండు రకాలుగా ఈ కొత్త టైటిల్ సెట్ అన్నమాట.

ప్రమోషన్లు షురూ..

మూవీ రిలీజ్ కు ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ ఇటీవలే ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్. మేకర్స్. మొదటి సింగిల్ గరం గరం తెలుగు వెర్షన్‌ను విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కింది. ఈ రోజు ఈ పాట మిగిలిన ప్రధాన భారతీయ భాషలలో విడుదలైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు