Singer Chinmayi: పిల్లల భవిష్యత్తుతో ఆటలా…? అనసూయపై చిన్మయి ఫైర్

Singer Chinmayi.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సమాజంలో మహిళలు , చిన్నారులపై జరిగే ఆకృత్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ ఉంటుంది. 2018లో వచ్చిన మీటూ ఉద్యమంలో తాను కూడా లైంగిక బాధితురాలినే అంటూ నోరు విప్పిన ఈమె అప్పటినుంచి ఇండస్ట్రీలో ఎవరైనా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నట్లు తనకు తెలిసినా లేదా ఎవరైనా తనతో చెప్పినా సరే అవతల ఉన్నది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే వారిపై ట్రోల్స్ చేస్తూ డైరెక్ట్ గానే విమర్శిస్తూ ఉంటుంది.

Singer Chinmayi: Playing with children's future...? Chinmayi fire on Anasuya
Singer Chinmayi: Playing with children’s future…? Chinmayi fire on Anasuya

లేడీ యాంకర్ పై చిన్మయి ఫైర్..

సాధారణంగా ఆడవాళ్లు లైంగిక వేధింపులకు గురయ్యారు అని తెలిస్తే ఒక రేంజ్ లో ఫైర్ అయ్యే ఈ ముద్దుగుమ్మ, మగవారి పైనే కాదు ఇప్పుడు ఆడవారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఈమె మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు.. అందులో భాగంగానే యాంకర్ అనసూయ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయి తన కోపం మొత్తాన్ని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకుంది అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

అసలు అనసూయ ఏం చేసిందంటే..

యాంకర్ అనసూయ జబర్దస్త్ చేస్తున్న సమయంలో చిన్నపిల్లలతో షో కూడా చేసేది.. ఒక ప్రముఖ టీవీ ఛానల్ లో పిల్లలతో సరదాగా కాసేపు అంటూ షో నిర్వహించేది.. అయితే ఈ షోలో భాగంగానే ఒక చిన్న అబ్బాయితో చీక్స్ పైన, హెడ్ పైన ముద్దు పెట్టించుకుంటుంది. లాస్ట్ లో లిప్ పైన కూడా కిస్ పెట్టించుకుంటుంది. ఇక ఈ సన్నివేశాన్ని చూసి షోకి వచ్చిన పిల్లల తల్లిదండ్రులతో పాటు ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.. ఇందులో చిన్నపిల్లల పట్ల అనసూయ అసభ్యకరంగా ప్రవర్తించింది.. ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.. దీనినే సింగర్ చిన్మయి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది చిన్మయి.

- Advertisement -

చిన్మయి పోస్ట్ వైరల్..

తన ఇన్స్టా గ్రామ్ ఖాతా లో ఒక షోలో ఒక లేడీ యాంకర్ ఒక పిల్లవాడిని తన మూతిపై ముద్దు పెట్టమని అడుగుతుంది. పైగా ఈ షోలో పిల్లల తల్లిదండ్రులతో పాటు ఆడియన్స్ అలాగే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేశారు.. ఇది ఎంతవరకు కరెక్ట్.. ఈ సన్నివేశం భయానకాన్ని సృష్టిస్తుంది. చిన్నపిల్లలకి ఎక్కడ ముద్దు పెట్టాలో ..ఎక్కడ ముద్దు పెట్టకూడదో కచ్చితంగా తల్లిదండ్రులు తెలియచేయాలి. అది వారి బాధ్యత.. ఈమె కూడా ఒక తల్లే కదా.. అలాంటిది ఒక పిల్లవాడిని తన పెదాలపై ముద్దు పెట్టమని అడగడం నిజంగా ఇంతకంటే దారుణం మరెక్కడ ఉండదు.

పిల్లలకు సురక్షితమైన బాల్యం ఎక్కడ..?

అసలు ఇలాంటి సన్నివేశాల వల్ల పిల్లలు భవిష్యత్తులో మానవ మృగాలుగా మారే అవకాశం ఉంది. చిన్నపిల్లలకు ఏమీ తెలియదు.. వారికి ఎక్కడ టచ్ చేయాలి ..? ఎక్కడ టచ్ చేయకూడదు..? అనే అంశాలు కూడా నేర్పించాల్సి ఉంటుంది.. ఒకవేళ ఇవన్నీ నేర్పించకపోతే.. చివరికి ఆ పిల్లలు ఎలా మారుతారో ఊహించుకుంటేనే భయం వేస్తోంది.. పిల్లల భవిష్యత్తుతో ఆటలేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. ముఖ్యంగా పిల్లలతో చేస్తున్న కామెడీ షోలు ఒకరకంగా చాలా భయంకరంగా మారుతున్నాయి.. పిల్లలకు సురక్షితమైన బాల్యాన్ని అందించాలనుకునే ఏ సమాజంలో కూడా ఇటువంటివి ఆమోదయోగ్యం కాదు అంటూ చిన్మయి తన సలహాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు