Thanu sree Datta: కమిటీల వల్ల ఎవరికి లాభం.. హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

Thanu Sree Datta. మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేరళ ప్రభుత్వం నడుం బిగించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ భావన (Bhavana,) పై హీరో దిలీప్(Dileep )లైంగిక దాడికి పాల్పడి ఆమెపై అత్యాచారం చేశారనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ విషయంపై ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే జస్టిస్ హేమా (Justice hema), ప్రముఖ సీనియర్ హీరోయిన్ శారద (Sarada )తో పాటు ఇంకొకరిని చేర్చి, ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి ఇండస్ట్రీలో జరిగే అన్యాయాల గురించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఒక రిపోర్ట్ అందజేయాలని కోరింది.

Thanu Sree Datta: Who benefits from committees.. Hot beauty shocking comments..!
Thanu Sree Datta: Who benefits from committees.. Hot beauty shocking comments..!

కమిటీల వల్ల ప్రభుత్వం సాధించిందేంటి..?

అందులో భాగంగానే దాదాపు 233 పేజీలు కలిగిన ఒక నివేదికను జస్టిస్ హేమా కమిటీ ప్రభుత్వానికి అందజేసింది. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది సెలబ్రిటీలు వివిధ సినీ ఇండస్ట్రీలలో తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో ఈ కమిటీ వల్ల ప్రభుత్వం సాధించిందేంటి ?అంటూ ఒక హాట్ బ్యూటీ చేసిన కామెంట్లు సర్వత్రా సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా మాజీ బాలీవుడ్ నటి తనూ శ్రీ దత్త (Thanu Sree Datta) చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

గతంలో విశాఖ పేరుతో కమిటీ.. కానీ ఫలితం లేదు..

ఈ విషయాలపై తనూ శ్రీ దత్తా మాట్లాడుతూ..ఈ కొత్త నివేదికతో ఉపయోగం ఏమిటి? వారు చేయాల్సిందల్లా నిందితులను అరెస్టు చేయడమే కదా.. పఠిష్టమైన శాంతి భద్రతలను అమలు చేయడం.. గతంలో పని ప్రదేశాలలో జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి విశాఖ పేరుతో ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ విచారణ జరిపి మార్గదర్శకాలు అంటూ పేజీల కొద్దీ కొత్త నివేదిక రూపొందించింది కానీ ఆ తర్వాత ఏం జరిగింది ? కేవలం కమిటీల పేర్లు మారాయి అంతే.. వీటివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం జరగలేదు అంటూ ఆవేదన చెందింది.. అంతేకాదు మరొకసారి నానా పటేకర్ (Nana Patekar)పై కూడా మండిపడింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

అలాంటి మానసిక రోగులకు చికిత్స ఉండదు..

దిలీప్, నానా పటేకర్ లాంటి మానసిక రోగులకు ఎలాంటి చికిత్స ఉండదు .ఇలాంటి దుర్మార్గులే లైంగిక వేధింపులకు పాల్పడతారు. ఈ వ్యవస్థ పై ఎటువంటి నమ్మకం లేదు. ఇలాంటి కమిటీలు నివేదికలతో పాలకులంతా అసలు సమస్యను పరిష్కరించకుండా సమయాన్ని వృధా చేసేస్తారు. కమిటీలు వేసి ప్రభుత్వాలు ఎలాంటి న్యాయం చేస్తున్నాయో చెప్పాలి. ముఖ్యంగా పని ప్రదేశాలలో భద్రత అనేది ప్రతి మహిళా, ప్రతి మనిషి యొక్క ప్రాథమిక హక్కు. ఈ హక్కుకి అసలు న్యాయం జరగడం లేదు. నిజానికి ప్రభుత్వాలు ఆ హక్కులను కాపాడుతున్నాయా? సమాజం ఎటు పోతుందో. ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకున్నాయా.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది . ప్రస్తుతం తను శ్రీ దత్త చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు