The Goat Collections : డిజాస్టర్ టాక్ తోనూ అరుదైన రికార్డ్ సృష్టించిన దళపతి విజయ్ సినిమా!

The GOAT Collections : కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన “ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం” సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే. లియో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ (Thalapathy Vijay) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా, యాక్షన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూసారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొత్తం రొటీన్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులకు విసుగు పుట్టించేలా వెంకట్ ప్రభు తెరకెక్కించాడని, ఇది గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం కాదని, వరెస్ట్ అఫ్ అల్ టైం అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. పైగా ఈసారి విజయ్ కూడా తన నటనతో ఇంప్రెస్ చేయలేకపోయాడని కామెంట్స్ వస్తున్నాయి.

The Goat Movie latest Collections

డిజాస్టర్ టాక్ తోనూ అరుదైన రికార్డ్..

అయితే దళపతి విజయ్ నటించిన గ్రేటెస్ట్ అఫ్ అల్ టైం సినిమాకి డిజాస్టర్ టాక్ రాగా, తొలి వీకెండ్ లో టాక్ తో సంబంధం లేకుండా అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. మొదటిరోజే ఏకంగా వంద కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకోగా, ఆ తర్వాత రోజుకు 50 కోట్ల చొప్పున వీకెండ్ లో అదిరిపోయే వసూళ్లు కొల్లగొట్టాడు. ఇకపోతే తాజాగా వీకెండ్ కలెక్షన్లు రాగా, నాలుగు రోజుల్లో ఏకంగా 285 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట. అయితే ఒక డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న తమిళ సినిమాకు ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ రావడం అరుదైన విషయం అని చెప్పాలి. ఇక సోమవారం తో గోట్ సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్ లో చేరనుందని సమాచారం.

- Advertisement -

మనోళ్లు మాత్రం పూర్తిగా పక్కనెట్టేసారు…

అయితే విజయ్ గోట్ (Greatest OfAllTme) సినిమాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆడియన్స్ అస్సలు పట్టించుకోవట్లేదు. సినిమాకి డిజాస్టర్ టాక్ రావడం ఒక కారణమైతే, ఇక్కడ వరదల ప్రభావం ఉండడం మరో కారణం. అయితే ఏది ఏమైనా విజయ్ సినిమా కాబట్టి ఇక్కడ మినిమం ఓపెనింగ్స్ వస్తాయని అనుకున్నారు. కానీ ఇక్కడ ఫస్ట్ డేన్ ప్రేక్షకులు తిరస్కరించారు. నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3.50 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టినట్టు సమాచారం. అయితే తెలుగులో 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన గోట్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలి. కానీ వర్కింగ్ డేస్ లో తెలుగు స్టేట్స్ లో గొట్ థియేటర్లు మొత్తం ఖాళీ అయిపోయాయి. ఇక్కడ తేరుకోవడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగులో మాత్రం గోట్ భారీ నష్టాలు అందుకునే ఛాన్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు