Tollywood Star heroine: బట్టలు విప్పితేనే ఛాన్స్ అన్నారు.. తెలుగు హీరోయిన్ ఎమోషనల్..!

Tollywood Star heroine.. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఉన్న విషయం తెలిసిందే. అయితే 2018 లో మీ టూ ఉద్యమం మొదలైన తర్వాత హీరోయిన్లు సోషల్ మీడియా ద్వారా ఒక్కొక్కరికి బాధలను చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు నోరు విప్పనివారు కూడా .. ఎప్పుడైతే మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదిక సమర్పించిందో అప్పటినుంచి చాలా సినీ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు ఒక్కొక్కరిగా ముందుకొచ్చి తమ కెరియర్ లో తాము ఎదుర్కొన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొస్తున్నారు.

Tollywood Star heroine: Chance said only if you take off your clothes.. Telugu heroine is emotional..!
Tollywood Star heroine: Chance said only if you take off your clothes.. Telugu heroine is emotional..!

అవకాశం కావాలంటే బట్టలు విప్పాల్సిందే..

ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా తనకు జరిగిన లైంగిక వేధింపులు, బెదిరింపుల గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం అడిగితే బట్టలు విప్పితే ఛాన్స్ ఇస్తామని అసభ్యంగా ప్రవర్తించారంటూ తెలిపింది.మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఆమనికి కూడా తప్పని లైంగిక వేధింపులు..

ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆమని(Amani). తన అందంతో, నటనతో, అమాయకత్వంతో ఎంతటి వారినైనా సరే తన అభిమానులుగా మార్చుకొని సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైనవి ఈమధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి మళ్ళీ తన నటనతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా మొన్నా మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి అభిమానులతో పంచుకుంది.

- Advertisement -

కోలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్..

ఆమని మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ అనే పదం మనం ఇప్పుడు వింటున్నాం.. కానీ అది సావిత్రి గారి కాలం నుంచే ఉంది. ఎంతో మంది హీరోయిన్లు పని ప్రదేశాలలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఆ రోజుల్లో మీడియా సోషల్ మీడియా లాంటిది అందుబాటులో లేవు కాబట్టి ఈ విషయాలు బయటకు తెలిసేవి కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. చీమ చిటుక్కుమన్నా సరే క్షణాల్లో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇక కాస్టింగ్ కౌచ్ అనేది నా తొలి రోజుల్లో నేను ఎదుర్కొన్నాను. అయితే పెద్ద సంస్థల్లో ఇలాంటివి అసలు జరగవు. కానీ కొన్ని సంస్థల్లోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక తమిళ్ సినిమాలో నాకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. అప్పుడు నాతోపాటు అమ్మ , తమ్ముడు కూడా వచ్చారు.

మచ్చ చూస్తాము.. బట్టలు విప్పండి అన్నారు..

హీరోయిన్గా ఛాన్స్ ఇస్తాము.. మీకు తొడ మీద ఏమైనా మచ్చ ఉందా అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. అక్కడ మచ్చ ఉండడం ఏంటి అనుకున్నాను. దానికి ఆయన ఇంతకుముందు ఒక హీరోయిన్ ని ఓకే చేసుకున్నాము. అయితే ఆమెకు అక్కడ మచ్చ ఉంది. మీకు కూడా ఉందేమో అని అడిగాము. ఒకసారి బట్టలు తీసేయండి చూస్తాము అన్నారు. ఇక ఈ సినిమా లో టూ పీస్ డ్రెస్ వేసుకోవాలి. స్విమ్ చేయాలని చెప్పారు. ఇక దానితో నేను ఆ క్యారెక్టర్ చేయను అని చెప్పి వచ్చేసాను. ఇక మరొకసారి ఒక సినిమా నిర్మాత ఫోన్ చేసి మేము బీచ్ లో ఉన్నాము. మిమ్మల్ని ఫైనాన్షియర్ చూస్తాడట రండి అన్నారు . ఇక నన్ను ఫైనాన్షియల్ చూడడం ఏంటి? అనుకొని ఆ సినిమా కూడా వద్దు అనుకున్నాను. ఇలాంటి సందర్భాలు నా కెరియర్ లో ఎన్నో జరిగాయి ఆ క్షణమే ఆ సినిమాలను వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను హీరోయిన్ అయిన తర్వాత ఎన్నో మంచి మంచి సంస్థల్లో పనిచేశాను. హెల్తీ వాతావరణం లో నా కెరియర్ సాగినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అంటూ తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు