Vishnupriya: అందాలకు తెరలేపిన యాంకర్.. ఇంత హాట్ చెల్లెలు ఉందా..?

Vishnupriya.. ప్రముఖ బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ ( Vishnu Priya)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . తన వాక్చాతుర్యంతో పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి, మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అప్పుడప్పుడు జబర్దస్త్ (Jabardast)వేదికపై కనిపించే ఈ ముద్దుగుమ్మ, ఈమధ్య కాలంలో పలు బుల్లితెర షోలలో కూడా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. గతంలో కామెడీ వీడియోలు , షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆ తర్వాత యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. సుడిగాలి సుదీర్ తో కలిసి పోవే పోరా ప్రోగ్రాం తో ఒక యూత్ ఫుల్ షో చేసి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

Vishnupriya: The anchor who opened the door to beauty.. has such a hot sister..?
Vishnupriya: The anchor who opened the door to beauty.. has such a hot sister..?

దయ సీరీస్ తో సక్సెస్..

ముఖ్యంగా నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్న ఈమె ఇటీవల ఈమె నటించిన వెబ్ సిరీస్ దయా కూడా మంచి విజయాన్ని అందుకుంది. హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన ఈ దయా సీరీస్ లో విష్ణు ప్రియ కీలక పాత్ర పోషించింది. జెడి చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో ఈషా రెబ్బ మరో కీలక పాత్ర పోషించగా, విష్ణు ప్రియ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సీరీస్ లో విష్ణుప్రియ లేడీ జర్నలిస్ట్ పాత్ర పోషించింది. ప్రస్తుతం దయ సీజన్ కి కొనసాగింపుగా సీజన్ 2 కూడా రాబోతోందని సమాచారం.

ఇండస్ట్రీకి దూరం..

అలాగే వాంటెడ్ పండుగాడు సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషించింది. అంతేకాదు అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్ కాస్ట్ కూడా ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా విజయాన్ని దక్కించుకోలేదు. దాంతో సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ డాల్ గా అవతారం ఎత్తింది. మోతాదుకు మించి విష్ణుప్రియ స్కిన్ షో చేస్తుందని చెప్పవచ్చు. వన్ మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె.. ఒక పోస్ట్ పెడితే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంది.

- Advertisement -

హెయిర్ డ్రెస్సర్ గా..

ఈమె శ్రియా శరన్ , ఆర్తి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్స్ వద్ద హెయిర్ డ్రెస్సర్ గా కూడా పని చేసిందట. ఇటీవల ఈమె తల్లి మరణించగా ఒక సిస్టర్ కూడా ఉంది. అప్పుడప్పుడు సిస్టర్ తో కలిసి ఫోటోలు వీడియోలు చేస్తూ ఉంటుంది విష్ణు ప్రియ. ఈ నేపథ్యంలోనే తాజాగా విష్ణు ప్రియ తన చెల్లిని మరొకసారి పరిచయం చేసింది. ఇటీవల తన చెల్లెలు పావని పుట్టినరోజు సందర్భంగా విదేశాలకు వెళ్లిపోయిన వీరిద్దరూ అక్కడ హాట్ డోస్ పెంచేసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

బోల్డ్ ఫోటోషూట్ తో పిచ్చెక్కిస్తున్న సిస్టర్స్..

అందాల గేట్లు తెరిచేసి బోల్డ్ గా కనిపించారు. ఈ ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు చాలా అందంగా ఉంది అంటూ కాంప్లిమెంట్ కూడా ఇస్తున్నారు. మొత్తానికి అయితే అక్క చెల్లెలు ఇద్దరు కూడా హాట్ డోస్ పెంచేసి మరింత రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా గ్లామర్ డోస్ లో వీరి తర్వాతే ఎవరైనా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు