Bigboss season 7: ఈసారి తప్పెవరిది?

Bigboss season 7:

బిగ్ బాస్ సీజన్ 7 ఆట మొదలైనప్పటినుండి ఆడియన్స్ దృష్టిలో కంటెస్టెంట్స్ లో అందరిలో ఎక్కువ ఆకర్షించింది పల్లవి ప్రశాంత్, రతిక. నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా ఇద్దరూ తమ ఆట ద్వారా కాకుండా, తమ ప్రవర్తన ద్వారానే ఎక్కువ దృష్టిలో పడ్డారు. మొదటి వారంలో పల్లవి ప్రశాంత్ తన పులిహోర ఆటతో టార్గెట్ అవగా, రెండో వారం రతిక తన మొండి వైఖరితో బిగ్ బాస్ హౌస్ లో టార్గెట్ అయింది. అయినప్పటికీ బిగ్ బాస్ లో పలు సందర్భాల్లో తమ ఆట ద్వారా మెప్పించారు.

ఇక బిగ్ బాస్ సీజన్ మొదటి ఎపిసోడ్ నుండే వీళ్ళ కాంబో లో వచ్చే ప్రతి వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఫస్ట్ వీక్ లో రతిక తో పులిహోర కలిపిన ప్రశాంత్ ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో తాను జెన్యూన్ గా ఆడట్లేదని అందరికి టార్గెట్ అయ్యాడు. అనూహ్యంగా రతిక కూడా ఇదే విషయంపై నామినేట్ చేయడంతో మలుపు తిరిగింది.

ఇక రెండో వారంలో ఒకే జట్టులో ఉన్న ప్రశాంత్, రతిక ఎడమొహం, పెడమొహం గా ఉన్నా, షకీలా ఎలిమినేట్ తర్వాత మళ్ళీ ఒకటయ్యారనిపించింది. దానికి తోడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఒక ప్రోమో లో రతిక ఒక ఇష్యూ లో ఫీల్ అవుతుంటే, ప్రశాంత్ ఓదారుస్తూ హ్యాపీ చేసే ప్రయత్నం చేసాడు.

- Advertisement -

కానీ తాజాగా మరో ప్రోమోలో ఇద్దరికీ పవర్ అస్త్ర విషయమో లేక ఇంకేదో టాపిక్ లో భాగంగా ,మాట మాట పెరిగింది. అప్పుడే ప్రశాంత్ తనని అక్కడ్నుంచి పొమ్మంటాడు, కానీ తను మొండిగా నువ్వేపో అంటుంది. అలా మాట పెరిగి ప్రశాంత్ తనని స్మూత్ గా పక్కకి జరిపే ప్రయత్నం చేస్తాడు. దీంతో రతిక కోపంతో మరో సారి మీద చెయ్యేస్తే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇస్తుంది. అక్కడే ఉన్న దామిని ఆపే ప్రయత్నం చేస్తుంది. అక్కడితో ప్రశాంత్ ఏందీ ఈ చిల్లర లొల్లి అంటూ లేచిపోతాడు.

లాస్ట్ వీక్ లో ఇద్దరు తమ తప్పులతో ఆడియన్స్ దృష్టిలో బ్యాడ్ అయ్యారు. మరి జరిగిన ఇష్యూ లో ఇద్దరిలో తప్పెవరిదో, ఆడియన్స్ సపోర్ట్ ఎవరికుంటుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు