Bigboss season 7:
టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 వేడి రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ సీజన్ గత సీజన్ కన్నా భిన్నంగా ఉండడం ప్లస్ పాయింట్ అయితే, సెలెబ్రిటీల కన్నా, జూనియర్ ఆర్టిస్ట్ లు ఎక్కువ మంది రావడం మరింత కొత్తగా అనిపించింది. అయితే గత సీజన్లలో బాగా ఆడవారికి, బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ అన్యాయం జరిగే వారికి ఆడియన్స్ సపోర్ట్ ఉండేది. కానీ ఈ సీజన్లో మాత్రం వారానికొకరు హైలెట్ అవుతుండడంతో ఆడియన్స్ కూడా ఎవరికీ నచ్చినట్టు వారు ఒక్కొక్కరిని సపోర్ట్ చేస్తూ వోట్స్ వేస్తున్నారు.
సెకండ్ వీక్ నుండి ఈ నామినేషన్ల సందడి ఊపందుకోగా, ఫస్ట్ వీక్ లో మెజారిటీ ఆడియన్స్ పల్లవి ప్రశాంత్ ని ఓటేసి సింపతీ చూపించగా, సెకండ్ వీక్ లో యావర్ కి ఓటేసి కాపాడారు. ఇక థర్డ్ వీక్ లో కూడా ఎక్కువగా యావర్ తో పాటు, ప్రశాంత్, ప్రియాంక లను కూడా ఆడియన్స్ బాగా వోట్ చేసి సావ్ చేస్తున్నారు.
ఇక ఈ వారం గౌతమ్ వైపు ఆడియన్స్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. నాలుగోవారం నామినేషన్ల ప్రక్రియలో గౌతమ్ యావర్ ని నామినేట్ చేస్తూ, తాను కొట్టడానికి వస్తున్నట్టు బెదిరించాడు, అది తనకు నచ్చలేదంటూ నామినేట్ చేస్తుండగా, దీనికి ఒప్పుకొని యావర్ మరోసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా గౌతమ్ మీదకి వెళ్ళాడు. అక్కడ గౌతమ్ ని ఏమి చేయకున్నా, కంటెస్టెంట్స్ మధ్యలో యావర్ తగ్గిపోయాడు. ఇక ఆడియన్స్ దృష్టిలో కూడా యావర్ కొంచెం తగ్గినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ వీక్ నామినేషన్లలో గౌతమ్ సైడ్ మెజారిటీ ఆడియన్స్ షిఫ్ట్ అయ్యేలా ఉన్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.