Adhipurush : ప్రభాస్.. ఆ పేరు ఖరీదు వంద కోట్లు

ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా ఇటీవలనే విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఇండియాస్ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ చిత్రంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న హీరోలెవ్వరికి లేని రికార్డ్స్ అన్నీ ప్రభాస్ పేరిట నమోదవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రిలీజైన తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా 138.64 గ్రాస్ ని కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది.

- Advertisement -

మొదటి రోజేవందకోట్లు కలెక్ట్ సినిమాల లిస్ట్ లో ఇప్పటికే ప్రభాస్ కు రెండు సినిమాలుండగా, ఆదిపురుష్ సినిమా మూడో చిత్రంగా నిలిచింది.

ఆదిపురుష్ సినిమా తొలి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
ప్రపంచవ్యాప్తంగా 138.64 గ్రాస్
ఏపి,టిఎస్ – 50.93 cr
కర్ణాటక – 8.57cr
తమిళ్ నాడు , కేరళ – 2.35cr
మిగితా రాష్టాల్లో- 48.24 cr
విదేశాల్లో- 26. 75cr వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఆదిపురుష్ సినిమాకి ప్రేక్షకుల దగ్గరనుంచి ప్రస్తుతం మిశ్రమ స్పందన వస్తోన్నవిషయం అందరికి తెలిసిందే. కానీ సినిమా చూడటానికి మాత్రం జనాలు ఆసక్తి చుపిస్తున్నారనేది వాస్తవం. దీనికి ఆదిపురుష్ సినిమాకి వచ్చిన ఈ కలెక్షన్లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

తెలుగులో ఆదిపురుష్ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 160cr కి కొనుగోలు చేయగా, తొలి రోజే యాబై కోట్లకి పైగా వసులు చేయడంతో ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఆదిపురుష్ సినిమా ఫుల్ రన్ లో పెట్టిన మొత్తాన్ని రాబట్టి, లాభాలు తెచ్చిపెడుతుందని ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తోంది

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు