Big boss season 7 Day 4 : హీరో శివాజీ నటవిశ్వరూపం చూపించేసాడు భయ్యా

Big boss season 7 Day 4

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రెండవ కంటిస్టెంట్ గా ఎంటరైనా శివాజీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఆయన నట విశ్వరూపం చూపించేసాడు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా శివాజీ హౌస్ లో కొద్దీ నిమిషాల పాటు కంటిస్టెంట్స్ ను భయపెట్టాడని చెప్పవచ్చు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో నిన్న జరిగిన ఎపిసోడ్ తో విజయవంతంగా నాలుగు రోజులు ముగిసాయి. నామినేషన్ తరువాతి రోజు బిగ్ బాస్ ఇచ్చిన ఫెస్ ది బీస్ట్ టాస్క్ లో భాగంగా ఆట సందీప్ మరియు ప్రియాంక విజేతలుగా నిలిచారు. దాంతో టాస్క్ లో చివరిదాకా పోరాడి కొంచెంలో పరాజయం పాలైన కంటిస్టెంట్స్ నిరాశ చెందారు. అందుకోసం గాను బిగ్ బాస్ మరో సరికొత్త టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో కంటిస్టెంట్స్ ఎవరి వారు తమదైన స్టైల్ లో బిగ్ బాస్ ను ఎంటర్టైన్ చేయవలసిందిగా కోరాడు. దాంతో కంటిస్టెంట్స్ అంత అందరు తమ తమ స్టైల్ లో బిగ్ బాస్ ను ఎంటర్టైన్ చేసారు.

అయితే కంటిస్టెంట్స్ అందరిలో డిఫరెంట్ వే లో ఎంటర్టైన్ చేసి, ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరో శివాజీ అనే చెప్పాలి. ఎందుకంటే హీరో శివాజీ ఒక్కడే అందరిలో కాస్త డిఫరెంట్ టాస్క్ చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసాడు. బిగ్ బాస్ తనకు కాఫీ పంపించలేదనే నెపంతో హౌస్ లో ఉన్న కంటిస్టెంట్స్ అందరిపై ఒక్కసారిగా విరుచుకు పడిపోయాడు. హౌస్ లో నుంచి వెళ్లిపోతానని కాసేపు డ్రామా క్రియేట్ చేసాడు. దాంతో అందరు కాసేపు టెన్షన్ పడ్డారు. కానీ శివాజీ మాత్రం మధ్య మధ్యలో కెమెరాను చూస్తూ ప్రేక్షకులకు హింట్ ఇస్తూనే పర్ఫామెన్స్ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించాడు. ఇక కాసేపటికి బిగ్ బాస్ శివాజీ కి నిజంగానే కాఫీ ఇవ్వడంతో టాస్క్ ముగిసింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు