Bigg Boss Season7: రైతు బిడ్డ ప్రశాంత్ ఇంత ఫేకా – కెమెరాల సాక్షిగా దొరికిపోయాడు..!

Bigg Boss Season7

మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్7 ఇటీవలే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే టీవీ ఆర్టిస్ట్స్, ఫిలిమ్ సెలెబ్రేటిస్, సోషల్ మీడియా సెలెబ్రిటీస్ తో నిండిన షో ఆకట్టుకుంటోంది. శివాజీ, టేస్టీ తేజ లు ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటుంటే, రైతు అనే సెంటిమెంట్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారి హౌస్ లోకి ఎంటరైన పల్లవి ప్రశాంత్ మాత్రం తన ఫేక్ బిహేవియర్ తో రెండో ఎపిసోడ్ నుండే నెగిటివ్ ఇంప్రెషన్ మూట కట్టుకుంటున్నాడు. హౌస్ మేట్స్ అంతా తనతో ఫ్రెండ్లీగా ఉంటున్నప్పటికీ తాను దూరంగా ఉంటూ కింద పాడుకుంటూ సింపతీ కోసం ప్రయత్నిస్తున్నాడు.

లంచ్ చేసే సమయంలో కింద పడ్డ మెతుకులు ఏరుకొని మరీ తినటం పై ఆడియెన్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫిజికల్ టాస్క్ లో బాగా పర్ఫామ్ చేసిన ప్రశాంత్ తాను టాప్ పర్ఫార్మర్ గా గెలవలేదని ఏడుస్తున్న సమయంలో హౌస్ మేట్స్ ఎంత ఓదార్చినప్పటికీ వారి మాటలు పట్టించుకోకుండా ఒక్కడే ఒంటరిగా కింద పడుకున్నాడు. ప్రశాంత్ వైఖరి జెన్యూన్ గా లేదని, ఆర్టిఫీషియల్ గా కెమెరాల కోసం నటిస్తున్నట్లుగా ఉందని మెజారిటీ ఆఫ్ ఆడియెన్స్ ఒపీనియన్.

ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో అధిక శాతం వోటింగ్ తో టాప్ పొజిషన్లో ఉన్నప్పటికీ ఇక మీదట తన బిహేవియర్ ఇలాగే ఉంటే గనక తొందరలోనే ఎలిమినేట్ అవ్వటం ఖాయం అని కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా హౌస్ లోకి ఎంటరవ్వటానికి ఉపయోగ పడ్డ సింపతీ గేమ్ హౌస్ లో కంటిన్యూ అవ్వటానికి కప్ గెలవటానికి మాత్రం హెల్ప్ అవ్వదనే చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు