Bigg Boss Season7: శుభ శ్రీ చెవిలో గౌతమ్ కృష్ణ ఎం చెప్పాడు ? మైక్ లాగి మరి దగ్గరికి లాక్కున్నాడు హవ్వ.. ?

Bigg Boss Season7

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మూడవ రోజు ముగిసేకల్లా ఆట మరింత రసవత్తరంగా సాగుతోంది. షో స్టార్ అయిన మొదటి రోజు నుంచే గ్యాంగ్ లు ఏర్పడగా.. ఇప్పుడిప్పుడే ప్రేమ జంటలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అయితే ప్రతి బిగ్ బాస్ సీజన్ లవ్ ట్రాక్స్ ఏర్పడటం కామనే అయిన ఈ ట్రాక్ లు ఎన్ని సార్లు చూసిన ప్రేక్షకులకు ఎంటర్టైనింగ్ గానే ఉంటోంది.

ప్రతి సీజన్ ఒక లవ్ ట్రాక్ ఉండటం సర్వసాధారణమే కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మాత్రం ఏకంగా రెండు లవ్ ట్రాక్ లు స్టార్ట్ అయ్యేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఒక జంట రతిక, పల్లవి ప్రశాంత్ లది అయితే రెండవ జంట గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ లది.

అయితే నిన్న ఎపిసోడ్ లో బిగ్ బాస్ మొదటి సారి, హౌస్ మేట్స్ కు ఫేస్ ది బీస్ట్ అనే టైటిల్ తో ఒక ఫీజికల్ టాస్క్ ను ఇచ్చాడు. మొదటి టాస్క్ అవడంతో కంటిస్టెంట్స్ అందరు ఉత్సాహంగా టాస్క్ లో పాల్గొన్నారు. ఆధ్యంతం వినోదాత్మకంగా సాగిన ఈ టాస్క్ లో ఆటా సందీప్, మరియు ప్రియాంక విజేతలుగా నిలిచారు.

- Advertisement -

బిగ్ బాస్ లో మొదటి టాస్క్ లో విన్నవ్వడంలో ఆట సందీప్ , మరియు ప్రియాంక చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అలాగే మిగితా కంటిస్టెంట్స్ టాస్క్ లో సరిగా పెర్ఫామ్ చేయనందుకు కాస్త ఫీల్ అయ్యారు. ఇక పల్లవి ప్రశాంత్ అయితే టాస్క్ లో బాగా పెర్ఫామ్ చేసిన కూడా కొంచెం డిఫరెన్స్ లో విజేతగా నిలవలేకపోవడంతో ఏడ్చాడు.

అదే విధంగా గౌతమ్ కృష్ణ కూడా టాస్క్ లో ఓడిపోయినందుకు ఒక్కడే బయట కూర్చొని బాగా బాధపడ్డాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్న..కాసేపటి తరువాత వెంటనే గౌతమ్ కృష్ణ బాత్రూం రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న శుభ శ్రీ చెవిలో ఎదో చెప్పాడు. తాను చెప్పిన విషయం గోప్యాంగ ఉండటానికి ఏకంగా మైక్ కూడా తీసేసి శుభ శ్రీ తో ఎదో చెప్పగా ఆమె నవ్వింది. దాంతో గౌతమ్ , శుభ శ్రీ చెవిలో ఏం చెప్పాడనేది ప్రస్తుతం చర్చనీయా అంశం అయ్యింది. దీనిబట్టి చూస్తే బిగ్ బాస్ మొదటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున అడిగే మొదటి పాయింట్ ఇదే అని అంత అనుకుంటున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు