Bigboss Season7:
మాటీవీ లో బిగ్ బాస్ సీజన్ 7 ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నా, ఉల్టా పల్టా అంటే ట్రూ గేమ్ కాదని బిగ్ బాస్ నిరూపిస్తున్నట్టు అయింది. స్వయంగా బిగ్ బాస్ నుండే కొన్ని తప్పుడు తీర్పులు వస్తుండే సరికి హౌస్ మేట్స్ కూడా కూడా తప్పులు చాలా కామన్ గా చేసేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా అందరికంటే ఎక్కువ తప్పులు చేస్తుంది మాత్రం సంచలక్ గా వ్యవహరిస్తున్న సందీప్ మాస్టర్ అని అందరికి తెలిసిందే.
సందీప్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో కంఫర్మ్ అయిన మొదటి కంటెస్టెంట్ కాబట్టి, తనకి పవర్ అస్త్ర తో పాటు సేఫ్ గేమ్స్ ఆడే ఛాన్స్ దక్కినట్టయింది. అందుకే ఎక్కువ టాస్క్ లు కాకుండా సంచలక్ గా వ్యవహరించే ఛాన్స్ దక్కింది. అయితే ఈ క్రమంలో సందీప్ మాస్టర్ జెన్యూన్ గా కాకుండా తప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నట్టు షో చూస్తున్న ఆడియన్స్ అందరికి యిట్టె తెలిసిపోతుంది. యావర్ మీద ముందు నుండి ఫైర్ అవుతున్న సందీప్ కొన్ని సార్లు తనని కావాలని నామినేట్ చేసినట్టు అనిపించింది. రీసెంట్ గా శోభా శెట్టి, గౌతమ్, ప్రశాంత్, శుభశ్రీ కి ఇచ్చిన టాస్క్ లో గౌతమ్ విన్ అవ్వాల్సింది.
శోభా శెట్టి కంటే తక్కువ సమయంలో తాను తిన్న వాటి కంటే ఒక హాఫ్ చికెన్ పీస్ ఎక్కువ తిన్నా కూడా, శోభా శెట్టిని విన్ చేసాడు. ఇక ఇప్పుడు తాజాగా ప్రియంకా, శోభా శెట్టి, యావర్ లో బిగ్ బాస్ ఉన్న ముగ్గుర్లో ఎవరు మెజార్టీ పర్సన్ కి సపోర్ట్ చేస్తారో అతనికి పవర్ అస్త్ర దక్కుతుందని అంటారు. అక్కడ ఉన్న ఇద్దరు ఫిమేల్స్ కాబట్టి, ఎలాగో సందీప్ కూడా వాళ్ళకే ఫేవర్ గా ఉన్నాడు, కాబట్టి యావర్ ఆడకుండానే ఓడిపోతాడు. అప్పుడు యావర్ మళ్ళీ ఇది రాంగ్ డెసిషన్ అని వాదిస్తుండగా, విషయం తెలుసుకోకుండా, యావర్ కి అర్ధమయ్యేట్టు చెప్పకుండా సందీప్ మళ్ళీ ఫైర్ అయ్యాడు. అందరికి సపోర్ట్ చేయకపోయినా, ఈక్వల్ ఇంపార్టెన్స్ అయినా ఇవ్వాలి. కానీ సంచాలక్ గా సందీప్ ఇవేమి చేయకుండా తప్పు మీద తప్పు చేస్తున్నాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the
Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.