Box office: డబుల్ ధమాకా అంటే ఇదే..

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మూవీ విరూపాక్ష. శ్రీ వెంకటేశ్వర సీనిచిత్ర బ్యానర్ లో బి. వి. ఎస్. ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. కార్తీక్ దండు విరూపాక్ష సినిమాను డైరెక్ట్ చేయగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రోషన్, సాయి చంద్, శ్యామల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది.

హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు నుంచే భారీ వసూళ్లు రాబడుతూ బ్లాక్ బస్టర్ దిశగా సాగింది. విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన ఈ విరూపాక్ష చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. పెట్టిన పెట్టుబడికి బయ్యర్లకి రెట్టింపు లాభాన్ని సంపాదించి పెట్టింది. విరూపాక్ష సినిమా 23 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా మూడు వారాల కలెక్షన్స్ తో 46 కోట్ల షేర్ సాధించి డబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

2023 లో “వాల్తేరు వీరయ్య” తర్వాత ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన సినిమాగా విరూపాక్ష రికార్డు సృష్టించింది. అయితే ఇతర భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. కానీ అక్కడ వేరే సినిమాల పోటీ వలన ఈ చిత్రాన్ని అంతగా పట్టించుకోలేదు. హిందీలో కూడా ఈ సినిమా ఆడుంటే వాటి కలెక్షన్లతో కలిపి ఇప్పటికే వంద కోట్ల మార్క్ దాటిపోయేది. అయితే ఇన్ని కలెక్షన్లు రావడానికి ఇతర చిత్రాలు కూడా ప్లాప్ అవ్వడం కూడా ఒక కారణం. ఏది ఏమైనా విరూపాక్ష ఒక్క తెలుగులోనే 86 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు