Box Office: మెగా మేనల్లుడి విధ్వంసం.. 4 రోజుల్లో టార్గెట్ ఔట్

మెగా బ్యాక్ గ్రౌండ్ తో చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో తన కృషి తోనే ఎదగాలని విభిన్నమైన స్క్రిప్ట్ లతో మంచి సినిమాలు చేస్తూ తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21 న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతుంది. సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

విరూపాక్ష సినిమా  22.20 కోట్ల బిజినెస్ చేయగా 23 కోట్ల టార్గెట్ తో విడుదలైంది. మొదటి రోజే మంచి మౌత్ టాక్ తో అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లో ఈ సినిమా 20 కోట్లకి పైగా షేర్ సాధించగా తాజాగా 4 రోజుల కలెక్షన్ల వివరాలు వచ్చాయి. విరూపాక్ష సినిమా నాల్గవ రోజు వరల్డ్ వైడ్ గా 3.51 కోట్ల షేర్ వసూలు చేసింది. 4వ రోజుతో విరూపాక్ష వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఒక్కసారి విరూపాక్ష ఏరియా వైస్ కలెక్షన్లను గమనిస్తే నైజాం 8.52Cr, సీడెడ్ 2.79Cr, ఉత్తరాంధ్ర 2.45Cr, ఈస్ట్ 1.32Cr, వెస్ట్ 97L, గుంటూర్ 1.38Cr, కృష్ణ 1.29Cr, నెల్లూరు 65L, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19.37 కోట్ల షేర్ వసూలు చేయగా 32.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ఇక కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా ఏరియా లు కలిపి 1.62Cr, ఓవర్సీస్ లో 3.36 కోట్లు వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 24.34 కోట్ల షేర్ వసూలు చేయగా 43.35 గ్రాస్ వసూలు చేసింది.

- Advertisement -

విరూపాక్ష సినిమాకి 23 కోట్లు టార్గెట్ కాగా కేవలం నాలుగు రోజుల్లోనే ఈ టార్గెట్ ని అందుకొని కోటి రూపాయల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇదే విధంగా లాంగ్ రన్ లో ఈ సినిమా ఆడితే 40 నుండి 45 కోట్ల వరకి షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. విరూపాక్ష సినిమా ఈ సంవత్సరం విడుదలైన సినిమాల్లో 10 వ క్లీన్ హిట్ సినిమా కావడం విశేషం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు