Bigboss season7: మొన్న రైతు బిడ్డ.. ఇప్పుడు డాక్టర్ బిడ్డ? మరొక డప్పు కొట్టుడే?

Bigboss season7:

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈసారి ఎక్కువగా ఫేమ్ లేని వాళ్ల్లే ఎంట్రీ ఇచ్చారన్న విషయం తెలిసిందే. ఒకవేళ జనాలకి తెలిసిన వాళ్ళైనా వాళ్ళు ఎప్పుడో ఫేడ్ అవుట్ అయినవాళ్ళు కావడం గమనార్హం. అయితే ఈ ప్రతి సీజన్లో ఎంటెర్టైన్మెంట్ కి సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ ఒకరు. బిగ్ బాస్ లోకి రావాలన్న లక్ష్యంతో ప్రశాంత్ గత ఏడాది నుండి ప్రయత్నించగా ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి తాను బిగ్ బాస్ లో ఆడడం మర్చిపోయి, అందరితోనూ తాను రైతు బిడ్డ నాని చెప్పుకుంటూ, ఎమోషనల్ గా అందర్నీ మెప్పించే ప్రయత్నం చేశాడు. అది చూసే వాళ్ళకి మరీ డప్పు కొట్టుకుంటున్నట్టు అనిపించింది. అందుకే ఆ తర్వాత నామినేషన్ లో హౌస్ మేట్స్ అందరు ఒక్క సారిగా తనపై ఫైర్ అయ్యారు. రైతు బిడ్డ అన్న పదం వాడకుండా జెన్యూన్ గా గేమ్ ఆడమన్నారు. ఆ తర్వాత ప్రశాంత్ తన తప్పు తెలుసుకున్నట్టే అనిపిస్తుంది.

ఇక ఈ వారంలో మరొక కంటెస్టెంట్ గౌతమ్ కూడా ప్రశాంత్ చేసిన తప్పే చేస్తున్నాడని అనిపిస్తుంది. స్వతహాగా డాక్టర్ అయిన గౌతమ్ హౌస్ లో పలు సందర్భాల్లో డాక్టర్ ని అని చెప్పుకుని తిరిగాడు. అయితే అక్కడి వరకు ఓకే గాని, తాజాగా ప్రిన్స్ యావర్ తో జరిగిన వాగ్వాదం లో తాను ఒక డాక్టర్ నాని డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేసాడు. తనతో గొడవ జరిగాక కుకింగ్ రూమ్ దగ్గర దామిని, శుభశ్రీ తో మాట్లాడుతూ, ఇంజక్షన్ లేసుకుని వచ్చి, బిల్డప్ ఇస్తూ, ఒక డాక్టర్ నే భయపెడతాడా? అంటూ అన్నాడు.

- Advertisement -

ఈ విషయం ఎక్కడివరకు వెళ్తుందో తెలియదు గాని గౌతమ్ కృష్ణ ట్రోలర్స్ కి అడ్డంగా బుక్ అయ్యాడని తెలుస్తుంది. మరి ఈ వీక్ నామినేషన్లో గౌతమ్ సిట్యుయేషన్ ఎలా ఉంటుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు