12th Fail : హిందీపరిశ్రమని ఊపేసిన సెన్సేషనల్ మూవీ.. తెలుగు టివి ప్రీమియర్స్ కి రెడీ!

12th Fail : బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో అనూహ్య విజయం సాధించిన సినిమా “12th ఫెయిల్”. విక్రాంత్ మెస్సి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడమే కాకుండా, విమర్శల ప్రశంసలు అందుకుంది. పలు అవార్డులు, రివార్డులు కూడా సాధించింది. కొన్నాళ్లుగా బాలీవుడ్ నుండి ఒక గొప్ప సినిమా ఏదైనా వచ్చిందా అంటే అది 12థ్ ఫెయిల్ అనే చెప్పాలి. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా వంద కోట్లకు పైగానే రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమాలో విక్రాంత్ మస్సీ ప్రధాన పాత్రలో నటించగా, దర్శకుడు ‘విధు వినోద్ చోప్రా’ దర్శకత్వం వహించాడు.

12th Fail Movie Telugu TV Premiere Streaming Update

IPS బయోపిక్ గా 12th ఫెయిల్..

ఇక 12th ఫెయిల్ సినిమా ఒకబయోగ్రాఫికల్ డ్రామాగా తెరకెక్కింది. నిజ జీవితంలో IAS ఆఫీసర్ అయిన ఒక అధికారి జీవిత కథ ఆధారంగా 12th ఫెయిల్ సినిమా తెరకెక్కింది. వినోద్ చోప్రా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. 12th ఫెయిల్ అయిన కుర్రాడు ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చి ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ. ఇక డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తెలుగులో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

- Advertisement -

టివి ప్రీమియర్స్ కి రెడీ అయిన 12th ఫెయిల్..

ఇక 12th ఫెయిల్ సినిమా ఇప్పటికే ఓటిటి లో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని నమోదు చేయగా, ఇప్పుడు తెలుగులో టివి ప్రీమియర్ కి సిద్ధమైంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న తెలుగు ప్రముఖ ఛానల్ ‘స్టార్ మా’ లో ఈ ఆదివారం మధ్యాహ్నం 1:00 PM గంటలకి 12th ఫెయిల్ మూవీని ప్రసారం చేయనున్నారు. ఇక శాంతాను మోయిత్రా సంగీతం అందించిన ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులని అలరించగా, బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇక 12th ఫెయిల్ మూవీ అతి త్వరలో చైనా లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు