Agent : అయ్యగారి సినిమా హిందీ టెలివిజన్ ప్రీమియర్స్ ఫిక్స్… తెలుగులో మాత్రం వద్దు బాబోయ్..

Agent : అక్కినేని అభిమానులకు లాస్ట్ ఇయర్ చేదు జ్ఞాపకంగా మిగిలిన సినిమా ‘ఏజెంట్’. ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అల్ట్రా డిజాస్టర్ గా నిలిచి బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక హీరోగా నటించిన అఖిల్ కి ఏజెంట్ పీడకలగా మారింది. అంతే కాదు నెట్టింట కొన్నాళ్ళు ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇక సురేందర్ రెడ్డి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన తర్వాత సినిమాకు స్టార్ హీరోలినెవ్వరిని ఒప్పించలేని స్థితికి ఈ సినిమా దిగజార్చింది. ఇక నిర్మాత అనిల్ సుంకర కూడా ఆ మధ్య సరేనా స్క్రిప్ట్ లేకుండా సినిమా చేయడమే మా తప్పని అందుకు తాము చాలా బాధపడుతున్నామని, ఇకపై ఆ తప్పు మళ్ళి చేయమని అన్నాడు. ఇదిలా ఉండగా ఏజెంట్ సినిమా గురించి లేటెస్ట్ గా మళ్లి వార్త వచ్చింది.

Agent Movie Hindi Television Premiere Update

ఏజెంట్ హిందీ ప్రీమియర్స్ కి ముహూర్తం..

ఇదిలా ఉండగా ఏజెంట్ (Agent) సినిమాని విడుదలైన ఏడాది తర్వాత టెలివిజన్ ప్రీమియర్ కి ముహూర్తం కుదిరింది. అయితే అది తెలుగులో కాదు హిందీలో. అవును… ఓటిటి కి కూడా మోక్షం లభించని ఈ సినిమాను ఓ ప్రముఖ ఛానల్ టెలికాస్ట్ చేయనుంది. ఈ నెల అనగా జూలై 28న ఏజెంట్ చిత్రాన్ని హిందీలో టెలికాస్ట్ చేయనున్నారు. ప్రముఖ ఛానల్ ‘గోల్డ్ మైన్స్’ సంస్థ ఈ చిత్రాన్నీ గోల్డ్ మైన్స్ ఛానల్ లో జులై 28న ఆదివారం రాత్రి 8 గంటలకు సినిమాను టెలికాస్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేసారు.

- Advertisement -

తెలుగులో మాత్రం వద్దు బాబోయ్…

అయితే ఏజెంట్ సినిమాని తెలుగులో మాత్రం రిలీజ్ చేయడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదని తెలుస్తుంది. ఇప్పటివరకూ తెలుగు ఛానెల్ లో ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాకపోగా, నెటిజన్లు సైతం థియేటర్లలో జరిగింది చాలు.. తెలుగులో మాత్రం వద్దు బాబోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమాని చూసేందుకు సిద్ధంగా లేరు. టివిలో వస్తే మాత్రం ట్రోల్ అవడం తప్ప ఇంకే లాభం లేదు. ఇప్పటికీ ఏజెంట్ దెబ్బ నుండి అఖిల్ కోలుకోలేదన్నది వాస్తవం. మరి మేకర్స్ తెలుగు ప్రీమియర్స్ కి ఏమైనా ధైర్యం చేస్తారో? లేదా లైట్ తీసుకుంటారో మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు