Ananth Ambani – Radhika merchant: పెళ్లిపై అలాంటి కామెంట్స్ చేసిన బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Ananth Ambani – Radhika merchant: ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీ అంగరంగ వైభవంగా జూలై 12వ తేదీన తన చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహాన్ని ఘనంగా జరిపించిన విషయం తెలిసిందే.. ఈ వివాహానికి ప్రపంచం నలుమూలలున్న బిజినెస్ మాగ్నెట్లతో పాటు సౌత్ , నార్త్ సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.. వారం రోజులకు పైగా జరిగిన ఈ వేడుకకు సుమారుగా రూ .5వేల కోట్ల ఖర్చు చేశారని సమాచారం.

Ananth Ambani - Radhika merchant: TV actress who made such comments on marriage.. Video viral..!
Ananth Ambani – Radhika merchant: TV actress who made such comments on marriage.. Video viral..!

అంబానీ ఇంట పెళ్లిలో మెరిసిన తారలు..

ముఖ్యంగా బాలీవుడ్ నుంచి చాలామంది స్టార్ సెలబ్రిటీలు జంటలుగా వివాహానికి హాజరవ్వగా. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు , నమ్రత , దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీ , రామ్ చరణ్, ఉపాసన తదితరులు హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి తనను పిలవలేదని ఒక బుల్లితెర సీనియర్ నటి అసహనం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వీడియోను షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మేమే పోషిస్తున్నాము.. మమ్మల్ని ఎందుకు పెళ్ళికి పిలవలేదు – జ్యోతిరెడ్డి

ఆమె ఎవరో కాదు ప్రముఖ సీరియల్ నుండి జ్యోతి రెడ్డి.. ఎండమావులు, రాధకు నీవే ప్రాణం, కార్తీకదీపం, ప్రేమ ఎంత మధురం, మధురానగరిలో వంటి హిట్ సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకొని.. తెలుగు ఆడియన్స్ హృదయాలను హత్తుకున్న ఈమె తాజాగా ఒక వీడియోని షేర్ చేస్తూ అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహంపై షాకింగ్ కామెంట్లు చేసింది.. ఆ వీడియోలో ఆమె ఏం మాట్లాడింది అనే విషయానికి వస్తే.. కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. అంబానీ ఫ్యామిలీ మిమ్మల్ని పెళ్లికి పిలవలేదని మీకు కడుపు మంట అని.. నాకు కడుపు మంటలు , గిడుపు మంటలు ఏమీ లేవు కానీ ఆ మెసేజ్ చూశాక, నాకు ఒక ధర్మ సందేహం కలిగింది. 2018 నుండి నాతోపాటు చాలామంది జియో వాడుతున్నారు.. ప్రతి నెల జీతం వచ్చినట్టు క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నాం. నేను అంబానీ చుట్టాన్ని కాదా..? జియో వారంతా కూడా అంబానీ చుట్టాలే కదా.. ప్రపంచంలోని గొప్పవాళ్ళందర్నీ పెళ్లికి పిలిచారు. ఇన్ని సంవత్సరాల నుండి జియో వాడుతూ మిమ్మల్ని పోషిస్తున్న మమ్మల్ని ఎందుకు మీరు పెళ్లికి పిలవలేదు..? చార్జీలు విపరీతంగా పెంచేశారు.. ఒక నెల జియో ఫ్రీగా ఇవ్వచ్చు కదా.? అదేమంటే చాలామంది ఆర్టిస్టులను పోషించారు అంటున్నారు.. ఎవరి డబ్బుతో ఎవరిని పోషించారు ? ఏం మాట్లాడుతున్నారు మీరు ? అంటూ సెటైరికల్ ఆన్సర్ చేసింది జ్యోతి రెడ్డి.

- Advertisement -

జ్యోతి రెడ్డి వీడియో కి నెటిజన్స్ కామెంట్స్..

ఇకపోతే జ్యోతి రెడ్డి చేసిన కామెంట్లకి నెటిజన్లు పాజిటివ్గా కామెంట్లు చేస్తూ వైరల్ గా నిలుస్తున్నారు… మీరు సూపర్ మేడం.. మీరు చెప్పినవన్నీ నగ్నసత్యాలు.. చాలా బాగా చెప్పారు అంటూ నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే జ్యోతి రెడ్డి చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు