Anchor Sravanthi: గొప్ప మనసు చాటుకున్న స్రవంతి.. స్టార్ హీరోయిన్స్ చూసి నేర్చుకోండి..!

Anchor Sravanthi.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలు వరద ఉధృతి కారణంగా నీటిమయం అయ్యాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ తినడానికి తిండి లేకుండా కొంతమంది ఆకలితో స్వర్గస్తులవుతున్నారు. దీంతో చలించిపోయిన చాలామంది రాజకీయ నేతలు , సెలబ్రిటీలు, ఆఖరికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమదైన సహాయాన్ని అందిస్తున్నారు. అయితే కోట్లకు కోట్ల రూపాయలు సినిమాల ద్వారా వెనకేసుకుంటూ, కనీసం కష్టాల్లో ఉన్న ప్రజలకు రూ.10 లక్షల కూడా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు హీరోయిన్లు. తెలుగు సినిమాల వల్లే స్టార్ స్టేటస్ ను అందుకొని, తాము నటించిన సినిమా సక్సెస్ కావడానికి తెలుగు ప్రజలంటే ఇష్టమని, వారంటే గౌరవం అంటూ కపట ప్రేమ చూపించిన చాలామంది హీరోయిన్లు ఈరోజు అదే తెలుగు ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే, కనీసం వారి కోసం మేము అండగా ఉన్నామంటూ నిలిచిన దాఖలాలు లేవు.

Anchor Sravanthi: Sravanthi who showed a great heart.. Learn by watching star heroines..!
Anchor Sravanthi: Sravanthi who showed a great heart.. Learn by watching star heroines..!

రెండు రాష్ట్రాలకు అండగా స్టార్ హీరోలు..

ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తుంటే అసలు హీరోయిన్లు ఏం చేస్తున్నారంటూ తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరికి మనస్తత్వం లేదా అంటూ పూర్తిస్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఒక బుల్లితెర యాంకర్ జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఉడతా భక్తిగా తన వంతు సహాయం అందించింది. ఆమె అందించిన సహాయం చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్లు కూడా ఈ యంగ్ బ్యూటీ ని చూసి నేర్చుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వరద బాధితులకు సహాయం ప్రకటించిన అనన్య..

ప్రస్తుత పరిస్థితులు దిగజారి పోతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.6 కోట్ల విరాళాన్ని ప్రకటించగా , ప్రభాస్ రూ.2 కోట్లు, చిరంజీవి, రామ్ చరణ్ , అల్లు అర్జున్, ఎన్టీఆర్ , మహేష్ బాబు ఇలా చాలామంది హీరోలు ఒక్కొక్కరుగా కోటి రూపాయల విరాళాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రకటించారు. ఒక్కో హీరో తమ స్థాయిలో ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అలాగే వెంకీ అట్లూరి, త్రివిక్రమ్, విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ, సాయిధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ ఇలా చాలామంది హీరోలు కూడా సహాయాన్ని ప్రకటించారు. ఇక హీరోయిన్ల నుంచి కేవలం అనన్య నాగళ్ళ మాత్రమే 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

- Advertisement -

రెండు రాష్ట్రాలకు సహాయం ప్రకటించిన స్రవంతి..

ఈమె తర్వాత యాంకర్ స్రవంతి(Anchor Sravanthi) తనవంతుగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రకటించింది. దీంతో నెటిజన్ లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో అనసూయ, రష్మీ, సుమ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా.. వాళ్ళు ఎవరు ఎందుకు ముందుకు రాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోయిన్లు, స్టార్ యాంకర్లు ఈ సందర్భంలో ముందుకు రాకపోవడం , ప్రభుత్వానికి అండగా నిలవకపోవడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకుల నుండే స్టార్ స్టేటస్ ను, హోదాను, డబ్బును సంపాదించిన వీరంతా ఇప్పుడు అదే ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా నిలవకపోవడం వారి స్వార్థానికి అద్దం పడుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు