Bigg Boss 8 : బిగ్ బాస్ 8 లాంచింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పటి నుంచి అంటే…?

Bigg Boss 8: బుల్లితెర రంగంలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్.. ఆడియన్స్ నుంచి ఈ షో కి ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ రియాల్టీ షో మొదలైందంటే చాలు… చాలామంది ఆడియన్స్, టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. అంతేకాదు సీజన్ మొదలయ్యేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో.. ఫైనల్ ఎపిసోడ్ కూడా అంతే ఉత్కంఠ గా చూస్తారు..ఇకపోతే ఇప్పటికే 7 సీజన్లు తెలుగులో దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కి సిద్ధం అయ్యింది..

Bigg Boss 8 : Bigg Boss 8 launch date has arrived... since when...?
Bigg Boss 8 : Bigg Boss 8 launch date has arrived… since when…?

బిగ్ బాస్ సీజన్ 8 అప్పటి నుంచే ప్రారంభం..

ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్ అందించింది బిగ్ బాస్.. తెలుగు సీజన్ 8 ఆగస్టు 4 లేదా 11వ తేదీలలో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అంతేకాదు ఇందులో పాటిస్పేట్ చేసే వ్యక్తుల వివరాలకు సంబంధించి కూడా తాజాగా ఒక జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక మొదలు అయింది.. మరి సీజన్ 8 బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే..

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టబోయేది.. బర్రెలక్క , నటి హేమ, హీరో రాజ్ తరుణ్ , నటి సురేఖ వాణి, యాంకర్ రీతూ చౌదరి , జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్ పి , కుమారి ఆంటీ , బ్రహ్మముడి సీరియల్ హీరో, హీరోయిన్ దీపిక , మానస్ లో పేర్లు ప్రధమంగా వినిపిస్తూ ఉండగా.. అనూహ్యంగా ఇందులోకి అమృత ప్రణయ్ పేరు కూడా రావడం సంచలనం సృష్టిస్తోంది.. పరువు హత్య ఘటనలో అప్పట్లో అమృత ప్రణయ్ పేరు సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వీరు అప్పట్లో తెగ వైరల్ అయ్యారు.. ముఖ్యంగా అమ్మాయి తరపు తల్లిదండ్రులు అబ్బాయిని దారుణంగా హతమార్చిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అమృత ప్రణయ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగింది.. ఇక ఇప్పుడు ఈమెను హౌస్ లోకి తీసుకురావాలంటూ నిర్వాహకులు నిర్ణయించుకున్నారట మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈమెకు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఏది ఏమైనా ఈ కొంతమంది పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్..

సీజన్ 3 నుంచి వరుసగా సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయనే హోస్ట్ గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8 బజ్ కోసం సీజన్ 7 లో తన ఆలోచనలతో కంటెస్టెంట్లను తికమక పెట్టించిన ప్రముఖ నటుడు శివాజీ హోస్టుగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు