Bigg Boss: నాలుగేళ్ల బంధానికి స్వస్తి.. విడాకులు దిశగా బిగ్ బాస్ బ్యూటీ..!

Bigg Boss..ఇటీవల కాలంలో ఎవరు ఎప్పుడు వివాహం చేసుకుంటారో తెలియదు. ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటారో కూడా తెలియదు.. ప్రస్తుత పరిస్థితి అలా మారిపోయింది. ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం.. కష్టం వచ్చినప్పుడు విడిపోవడం అనేది కూడా చాలా సహజంగా మారిపోయిందనే చెప్పాలి.. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఒక బ్యూటీ తన నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతోందని సమాచారం.

విడాకుల దిశగా చందన్ శెట్టి, నివేదిత గౌడ..

Bigg Boss: End of four years relationship.. Bigg Boss beauty towards divorce..!
Bigg Boss: End of four years relationship.. Bigg Boss beauty towards divorce..!

అసలు విషయంలోకెళితే బిగ్ బాస్ షోలు చూపించే లవ్ అంత కేవలం టిఆర్పి స్టన్స్ స్టంట్స్ మాత్రమే అని చాలామంది చెబుతూ ఉంటారు.. కానీ తమ ప్రేమ నిజమైనదని.. అగ్నిలాగా స్వచ్ఛమైనది అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చందన్ శెట్టి, నివేదిత గౌడ నిరూపించారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్నంతసేపు చాలా అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వీరు 2020 ఫిబ్రవరి 26న చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు. హనీమూన్ కి నెదర్లాండ్ కి కూడా వెళ్లి వచ్చారు.. ఇక సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వచ్చారు.

విడాకులు దిశగా బిగ్ బాస్ జంట..

ఇలా ఇంత అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కలికాలం కలిసి ఉంటారని అందరూ అనుకున్నారు.. కానీ అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు.. ఇద్దరూ కూడా విడిపోయేందుకు నిర్ణయించుకుని.. బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసినట్లు ఒక వార్త వైరల్ గా మారింది.. అయితే దీనిపైన ఇంతవరకు అటు చందన్, ఇటు నివేదిత ఎవరు స్పందించలేదు.. కానీ ఈ వార్తలు మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.. నిజానికి ఇలాంటి వార్తలు వచ్చాయంటే కచ్చితంగా వారు విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి.. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది జంటలు విడిపోతున్నట్లు వార్తలు రాగా.. ఇక నిజంగానే వారంతా విడాకులు తీసుకున్నారు. అయితే మరికొంతమంది ఇలాంటివి కేవలం పుకార్లు మాత్రమే అంటూ చెక్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మరి ఈ జంట విడాకుల దిశగా వెళ్తుందా లేక రూమర్స్ అంటూ కొట్టి పారేస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది..

- Advertisement -

చందన్ శెట్టి కెరియర్..

ఇకపోతే చందన్ శెట్టి రైల్వే చిల్డ్రన్, పొగరు, చూ మంతర్ , జోష్ లే వంటి చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు..

ప్రేమ , పెళ్లి వివరాలు..

సొంతంగా పాటలు కూడా పాడేవారు. కన్నడ బిగ్ బాస్ సీజన్ 5 లో విజేతగా నిలిచాడు.. ఇదే సీజన్లో నివేదిత గౌడ కూడా కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసింది. మొదట ఫ్రెండ్స్ అయిన వీరు ఆ తర్వాత రిలేషన్ లోకి వెళ్లారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్దలకు తమ ప్రేమ గురించి చెప్పి పెళ్లి చేసుకున్నారు.. ఇకపోతే వీళ్లిద్దరూ కలిసి జంటగా నటించిన క్యాండీ క్రష్ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఏది ఏమైనా వీరిద్దరి గురించి వస్తున్న విడాకుల వార్తలకు అటు వీరిద్దరూ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు