Chaitanya Master Mother: స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న చైతన్య మాస్టర్ తల్లి… వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

Chaitanya Master Mother: బుల్లితెర పై సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న ఏకైక డ్యాన్స్ షో ఢీ ద్వారా చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. అందులో ప్రముఖ చైతన్య మాస్టర్ కూడా ఒకరు.. ఎన్నో పాటలకు కంపోజ్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.. ఆయన కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలను విడిచారు.. ఆయన మరణం పై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు.. తాజాగా చైతన్య మాస్టర్ తల్లికి సంబందించిన ఎమోషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఢీ షోలో డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహారిస్తున్న చైతన్య మాస్టర్ అప్పుల బాధల వల్లే, అప్పులు తీర్చేలేకే, ఒత్తిడి ఎక్కువయ్యే చనిపోతున్నట్టు, ఆత్మహత్య ముందు ఓ వీడియో రిలీజ్ చేసాడు. అతని మరణం డ్యాన్సర్లని, డ్యాన్స్ మాస్టర్స్ ని కలిచివేసింది.. ఈ విషయం విన్న చాలా డ్యాన్సర్లు, మాస్టర్స్ విషాదంలో మునిగారు. మాస్టర్ మరణానికి ముందు ఆయన షోలో చేసిన పెర్ఫార్మన్స్ లను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు..

Chaitanya Master's mother's emotional video viral in social media
Chaitanya Master’s mother’s emotional video viral in social media

ఇదిలా ఉండగా.. తాజాగా మరోసారి చైతన్య మాస్టర్ ని గుర్తుచేస్తూ ఆయన చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ని మళ్ళీ చేసారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.. ఆ షోకు చైతన్య మాస్టర్ తల్లి కూడా వచ్చింది.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. వీళ్లంతా నా కొడుకులే. రేపు నేను చనిపోతే వస్తారా? నన్ను మోస్తారా? మీరే నన్ను మోయాలి. మీరే నాకు తలకొరివి పెట్టాలి. ఇదే నా కోరిక. ఎందుకంటే నాకు నా కొడుకు లేడు కాబట్టి అంటూ ఏడ్చేసింది.. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.. ఆమెను చూసి ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఆ వీడియోను చూస్తే కన్నీళ్లు ఆగవు.. మీరు ఒకసారి చూసేయ్యండి..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు