Bramhamudi Actor : “బ్రహ్మముడి” రుద్రాణి రోజుకు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Bramhamudi Actor : సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా ట్రెండ్ మారింది. అత్త, అమ్మ క్యారెక్టర్స్ కోసం ముసలి వాళ్లను కాకుండా యంగ్ గా ఉన్నవాళ్లనే తీసుకుంటున్నారు. అత్తకు, కూతురుకు పెద్ద తేడా లేకుండా చేస్తున్నారు. సీరియల్స్ ప్రేమ్ అందంగా కనిపించేందుకు మేకర్స్ ఇలా దించుతున్నారని తెలుస్తుంది. బ్రహ్మముడి’ సీరియల్‌లో విలనిజం చూపిస్తున్న రుద్రాణి ఇదే కోవలోకి వస్తుంది. రుద్రాణి పాత్రలో.. బ్రహ్మముడి సీరియల్‌లో ఆస్తి మొత్తాన్ని తన కొడుకుకు రావాలని, ఆ ఆస్తికి వారసుడిని చేయాలని పన్నాగాలు పన్నుతూ.. రాజ్, కావ్యలను ఇబ్బంది పెట్టే పాత్రలో నటిస్తుంది. అయితే ఆమె రోజుకు తీసుకొనే రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సీరియల్ హీరోల కన్నా ఎక్కువే అనే టాక్ వినిపిస్తుంది.

రుద్రాణి అసలు పేరు షర్మిత గౌడ.. 1985 నవంబర్ 20న కర్ణాటకలోని చిక్మగలూరులో షర్మిత గౌడ జన్మించారు. సెయింట్ జోసఫ్ గర్ల్స్ హై స్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. అలాగే కువెంపు యూనివర్సిటీలో ‘మాస్టర్ ఆఫ్ సైన్స్‌లో బయోకెమిస్ట్రీ పూర్తి చేశారు. 2008లో కేదార్ ప్రసాద్‌ అనే వ్యక్తికి వివాహం చేసుకున్నారు. అయితే షర్మిత గౌడకు చిన్నప్పటి నుంచే మోడలింగ్, యాక్టింగ్‌పై ఇష్టం ఎక్కువ. న్యూట్రిషన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ తర్వాత మోడలింగ్ వైపు దృష్టి సారించింది. అలా సీరియల్స్ లో నటించే ఛాన్స్ పట్టేసింది.. ఇప్పుడు కన్నడ తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది..

Do you know the remuneration for "Brahmamudi" Rudrani day?
Do you know the remuneration for “Brahmamudi” Rudrani day?

ఈ సీరియల్‌లో స్ట్రాంగ్ క్యారెక్టర్‌ను ప్లే చేస్తున్న రుద్రాణికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని తెలిసింది. టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలు తెలియజేసిన ప్రకారం.. ప్రతీ రోజు ఆమెకు 15 వేల రూపాయలు చొప్పున పారితోషికం అందిస్తున్నట్టు సమాచారం. ఇలా నెలకు దాదాపు 25 రోజులు సీరియల్స్‌లో నటిస్తూ రూ. 5 లక్షలు తీసుకోబోతున్నట్లు సమాచారం.. ఇక తన నటనతో విమర్శకు నుంచి సైతం ప్రశంసలు పొందారు. నెగిటివ్ పాత్రలో లీనమై.. ఆ పాత్రకు న్యాయం చేస్తుంది. అయితే సీరియళ్లలో విలన్‌గా కనిపించే ఈ భామ.. రియల్ లైఫ్‌లో అల్లరి పిల్ల. ఆమె చేసే అల్లరి చేష్టలు అంతా ఇంతా కాదు. ఇక గ్లామర్ డోస్ పెంచుతూ రోజుకో యాంగిల్ లో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈమె లేటెస్ట్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు