Hamida : హగ్గులు, ముద్దులతో ముంచెత్తిన హమీదా… అరె ఏంట్రా ఇది..

మాజీ బిగ్ బాస్ బ్యూటీ హమీద పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బిగ్ బాస్ లో హాట్ అందాలతో రచ్చ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలకు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది.. ఆ తర్వాత కొన్ని షోలలో కనిపించి కుర్రాకారుకు మతిపోగొట్టింది.. ప్రస్తుతం బుల్లితెర పై సందడి చేస్తుంది.. ఈ అమ్మడు తాజాగా ఓ షోలో కనిపించింది.. ఆ షోలో ఆమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ప్రముఖ ఓటీటి సంస్థ ఆహాలో జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ఓ షో నిర్వహిస్తున్నారు.. ఆ షోనే సర్కార్.. ఈ షో స్టార్ట్ అయిన అతి కొద్ది రోజుల్లోనే మంచి వ్యూస్ ను రాబట్టింది.. తాజాగా ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఒక సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న గేమ్ షో ‘సర్కార్’. సీజన్ 4కి ‘సుడిగాలి’ సుధీర్ యాంకరింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. పదో ఎపిసోడ్ ప్రోమో లేటెస్టుగా రిలీజ్ అయ్యింది. యాంకర్ స్రవంతి చొక్కారపు, ‘బిగ్ బాస్’ ఫేమ్ శోభా శెట్టి, ‘బ్రహ్మముడి’ ఫేమ్ హమీద వచ్చారు..

hamida latest video viral in social media
hamida latest video viral in social media

అయితే హమీద రాగానే డ్యాన్స్ చేసింది.. బర్త్ డే విషెష్ చెప్పిన సుధీర్ కు థ్యాంక్యూ చెబుతూ హగ్ ఇచ్చింది.. అంతేకాదు కిస్ చేసినట్లు ఉంది.. గేమ్ స్టార్ట్ అయ్యాక ‘సుధీర్ను అలా చూస్తుంటే నాకు బిడ్ చేయాలని అనిపించడం లేదు’ అని చెప్పింది హమీదా. షోకి సుధీర్ గురించి వచ్చానని చెప్పింది ఇంకోసారి. ప్రేమ అంటే గుడ్డిగా నమ్మడం అని సుధీర్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. ఆమె హగ్ ఇచ్చిన తర్వాత ‘దేవుడు ఓదారుస్తున్నాడు’ అని స్రవంతి అంటుంది.. మొత్తంగా చూసుకుంటే ఆ ఎపిసోడ్ సరదాగా సాగినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో సుధీర్ లో ఏదో మ్యాజిక్ ఉంది భయ్యా ఎవ్వరు వదలట్లేదు అంటూ సుధీర్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు