Jabardast: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జబర్దస్త్ చైల్డ్ ఆర్టిస్ట్..!

Jabardast.. సినిమా ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెర ఇండస్ట్రీలలో కూడా చైల్డ్ ఆర్టిస్టులు అత్యంత కీలకంగా మారిపోయారు. ముఖ్యంగా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న తర్వాత చదువుల రీత్యా ఇండస్ట్రీలకు దూరమయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఎంతోమంది చిన్నారులు, ఇప్పుడు పెద్దవారైన తర్వాత ఒక్కొక్కరిగా సోషల్ మీడియా ద్వారా బయటకి వస్తుంటే అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే మనం చూసిన చైల్డ్ ఆర్టిస్ట్ ఏనా ఇప్పుడు ఇలా మారిపోయారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ చైల్డ్ ఆర్టిస్ట్ యోధ కూడా ఒకరు. ప్రస్తుతం యోధ పెద్దదైపోయింది.ఈమెను చూసిన ప్రతి ఒక్కరూ అరే యోధ ఇంత పెద్దగా ఎప్పుడు అయ్యింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Jabardast: Child artist who has changed beyond recognition..!
Jabardast: Child artist who has changed beyond recognition..!

యోధా సిస్టర్స్ గా భారీ పాపులారిటీ..

నిజానికి యోధ జబర్దస్త్ లోనే కాదు చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా అత్తా కోడలుగా రమ్యశ్రీ, యోధ చేసిన స్కిట్స్ అప్పట్లో ట్రెమండస్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఎక్కడ చూసినా వీరి వీడియోలే వైరల్ అయ్యాయి. ఇద్దరు స్మాల్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చారు. యోధా సిస్టర్స్ గా పటాస్ ప్రోగ్రాం లోకి అడుగుపెట్టిన వీరిద్దరూ యోధా సిస్టర్స్ అనే పేరుతోనే ఎన్నో స్కిట్స్ చేసి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. యోధ ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేష్టలతో పిల్ల కాదురా పిడుగు అనిపించేలా నటించేది.

జబర్దస్త్ కే స్పెషల్ అట్రాక్షన్..

అంతేకాదు దేశముదుర్లు అనే కామెడీ షో కూడా చేశారు. వీరి గ్యాంగ్ లోకి దీవెన కూడా వచ్చి చేరింది. చదువుల నిమిత్తం రమ్యశ్రీ పూర్తిగా ఇండస్ట్రీ నుండి తప్పుకోగా.. యోధ, దీవెన కంటిన్యూ అయ్యారు. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి వచ్చారు. అవినాష్, కార్తీక్ టీంలో చేసి ఆ తర్వాత రాకింగ్ రాకేష్ టీమ్ లోకి షిఫ్ట్ అయిపోయారు. అలా ఈ షో పెద్దల స్కిట్ నుండి పిల్లల షో గా మారిపోయింది. అంతేకాదు ఈ ఇద్దరే షో కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేవారు. అలా సినిమాలు, జబర్దస్త్ అంటూ భారీ పాపులారిటీ దక్కించుకున్న యోధ అనూహ్యంగా చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరమైంది.

- Advertisement -

యుక్త వయసుకు వచ్చిన యోధ..

యోధ సొంత ఊరు ఖమ్మం జిల్లా. ప్రస్తుతం కుటుంబంతో సహా అక్కడే ఉంటున్నారు. ఇండస్ట్రీలోకి రాకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ స్వింగ్లో కొనసాగుతోంది.తండ్రి చందుతో కలిసి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన యోధ, రీల్స్ , వీడియోలు చేస్తోంది. ప్రస్తుతం ఈమెను చూస్తుంటే టీనేజ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. బుట్ట బొమ్మగా చక్కనైన చిరునవ్వుతో పరికిణిలో కుందనపు బొమ్మలా ఉంది.ప్రస్తుతం యోధ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. యోధను చూసిన వారంతా కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం యోధ పదవ తరగతి చదువుతోంది అంటే వచ్చే ఏడాది ఆమె కాలేజీలోకి కూడా అడుగు పెట్టబోతోంది. ఫ్యాన్స్ రీయంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. మరి యోధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు