Jabardast Comedian : తల్లిదండ్రులు కాబోతున్నామంటూ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ జంట

Jabardast Comedian.. జబర్దస్త్ లో జంటగా తమ కామెడీ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు అప్పుడప్పుడు సినిమాలలో వెబ్ సిరీస్ లలో కూడా అలరిస్తున్న జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి జబర్దస్త్ షోలో అలాగే ఇతర టీవీ షోలో కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా సుజాత న్యూస్ ప్రజెంటర్ గా తన కెరియర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ లో లవ్లీ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట తాజాగా శుభవార్త తెలుపుతూ ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.

Jabardast Comedian: Jabardast couple released an emotional video saying they are going to be parents..!
Jabardast Comedian: Jabardast couple released an emotional video saying they are going to be parents..!

గుడ్ న్యూస్ చెప్పిన జోర్దార్ సుజాత..

సుజాత సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఛానల్ లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటూ ఉంటుంది.. అందులో భాగంగానే త్వరలోనే అమ్మా నాన్న కాబోతున్నాము అంటూ గతంలోనే గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా అప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక వీడియోలో సుజాత మాట్లాడుతూ.. ఒక మంచి సందర్భం చూసి ఈ సంతోషకరమైన విషయాన్ని చెప్పాలనుకున్నాను.. ఆ సమయం ఇప్పుడు వచ్చింది రాకేష్ తండ్రి కాబోతున్నాడు అంటూ సుజాత చెప్పగానే రాకేష్ ఎమోషనల్ అయిన విషయాన్ని ఆమె పంచుకుంది.

సుజాత కు ఘనంగా సీమంతం వేడుకలు..

ఇప్పుడు తాజాగా మరో వీడియో పంచుకుంది సుజాత. ఈ నేపథ్యంలోనే తాజాకు ఈమెకు సీమంతం వేడుకలు జరగగా.. ఆ సీమంతానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఎమోషనల్ అవుతూ ఈ విషయాన్ని పంచుకోవడంతో అభిమానులు ఫాలోవర్స్ ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.ఇప్పుడు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరలోనే పందంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాకేష్ ఒక సినిమా నిర్మిస్తున్నాడు. ఇటీవలే మాజీ సీఎం కెసిఆర్ తో ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేయించారు ..అమ్మ అనే పిలుపుకు దగ్గరలో అంటూ సుజాత షేర్ చేసిన వీడియో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది.

- Advertisement -

జోర్దార్ సుజాత కెరియర్..

ఇక సుజాత కెరియర్ విషయానికి వస్తే , గతంలో న్యూస్ యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టి, ఆ తర్వాత తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది కూడా. సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ 1,2 సీజన్లలో సుజాత తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. అలాగే పలు సినిమాలలో కూడా ఈమెకు అవకాశాలు వస్తూన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈమె గర్భవతి కాబట్టి నటించడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. త్వరలోనే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ సినిమాలలో బిజీగా మారాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పుడు సుజాత కు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Strikers (@strikersinsta)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు