Jabardast: కమెడియన్ ఇంట విషాదం.. స్వయంగా పాడే మోసిన కూతురు..!

Jabardast.. జబర్దస్త్ (Jabardast)..ఎంతో మంది టాలెంట్ ను నిరూపించుకోవడానికి వేదిక అయింది. అలా టాలెంట్ నిరూపించుకోవడానికి వచ్చిన వారిలో తన్మయి(Thanmayi ) కూడా ఒకరు. తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో కమెడియన్ గా అలరించి ప్రేక్షకులను మెప్పించారు. ఇదిలా ఉండగా తాజాగా వీరి వెంట విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నప్పటి నుంచి చెయ్యి పట్టి నడిపించిన తన తండ్రి కన్నుమూయడంతో కన్నీరు మున్నీరు అవుతోంది ఈ ముద్దుగుమ్మ. తన తండ్రి చనిపోయాడు అంటూ ఈమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది.

Jabardast: Tragedy in the comedian's house.. The daughter who sings herself..!
Jabardast: Tragedy in the comedian’s house.. The daughter who sings herself..!

తండ్రి మరణం.. పాడె మోస్తున్న తన్నయి..

అంతేకాదు ఇందులో తండ్రి పాడే మోస్తూ కన్నీరు మున్నీరు అయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. మా నాన్ననే నా హీరో.. నాన్న ఒక ఎమోషన్.. మిస్ యు నాన్న.. ఎప్పటికీ నువ్వు నా మనసులోనే ఉంటావు కొడుకునైనా కూతురు నైనా నేను మీ బిడ్డనే అంటూ తన్మయి షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ గా మారుతోంది.

లింగ మార్పిడి శస్త్ర చికిత్స..

ఇది చూసిన నెటిజెన్లు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రిప్ అంటూ కామెంట్ చేస్తున్నారు. తన్మయి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ఇక తన్మయి విషయానికి వస్తే.. అబ్బాయిగా పుట్టినప్పటికీ హార్మోన్ల అసమతుల్యత కారణంగా అమ్మాయిగా మారిపోయింది .తన్మయి లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ఒక షోలో బహిరంగంగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా జబర్దస్త్ షోలోకి తన్మయి పేరుతో అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో ఈమె వేసే లేడీ గెటప్ లు ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తూ ఉంటాయి. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో కూడా సందడి చేస్తోంది.

- Advertisement -

టీవీ షోలు, రీల్స్ ద్వారా పాపులారిటీ..

ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ టీవీ షోలతో కూడా అలరిస్తున్న ఈమె రీల్స్, వీడియోలు చేస్తూ తన ఫాలోవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది అని చెప్పవచ్చు. ఎక్కువ శాతం జబర్దస్త్ నటీనటులతోనే రీల్స్ చేస్తూ , నవ్విస్తూ, అలరిస్తూ ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఈ కమెడియన్ ఇప్పుడు పుట్టేడు దుఃఖంలో ఉండడం చూసి అభిమానులు చలించిపోతున్నారు. అంతేకాదు కొంతమంది ఏకంగా కంటతడి పెట్టుకుంటున్నారు కూడా. ఏది ఏమైనా తన్మయి తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో చాలా వైరల్ అవ్వడమే కాదు ఎప్పుడూ నవ్వించే తన్మయిని ఇంతలా ఏడవడం ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మళ్లీ తిరిగి ఆ బాధ నుంచి తేరుకొని జబర్దస్త్ లో ఎప్పటిలాగే అందర్నీ నవ్వించాలని కోరుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు