Jabardasth: మరో వ్యక్తిని ఆహ్వానిస్తున్నాం.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమెడియన్..!

Jabardasth.. స్టాండప్ కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టిన యాదమ్మ రాజు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.పటాస్ టీవీ షో ద్వారా తనదైన కామెడీ స్కిట్లతో బుల్లితెర ఆడియన్స్ ను ఆకట్టుకున్న యాదమ్మ రాజు ఆ తర్వాత టాప్ కామెడీ షో జబర్దస్త్ లోకి అడుగుపెట్టి స్టార్ కమెడియన్గా పేరు దక్కించుకున్నారు. ప్రస్తుతం అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై కూడా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్న యాదమ్మ రాజు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు . త్వరలోనే తాను తండ్రి కాబోతున్నాను అంటూ ఈ శుభవార్తను అందరితో పంచుకున్నాడు.

Jabardasth: We are inviting another person.. the comedian who posted an emotional post..!
Jabardasth: We are inviting another person.. the comedian who posted an emotional post..!

గుడ్ న్యూస్ చెప్పిన యాదమ్మ రాజు..

ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసిన ఈయన తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేయడం అందరిని కలచివేసింది. ప్రస్తుతం ఈ జంటకు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జబర్దస్త్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాదమ్మ రాజు సద్దాం తో కలిసి కామెడీ స్కిట్స్, ప్రోగ్రామ్స్ చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షో లతో కూడా బిజీగా ఉన్న ఈయన ఏడాదిన్నర క్రితం యూట్యూబర్ స్టెల్లా రాజ్ ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జంట మరొకరిని తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. స్టెల్లా గర్భంతో ఉంది అంటూ ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు..

భార్య స్టెల్లా గర్భవతి..

తన భార్య స్టెల్లా గర్భవతి అంటూ చెప్పడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈమెతో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు యాదమ్మ రాజు. అంతే కాదు ఎనిమిదేళ్ల అపురూపమైన ప్రేమ, ఏడాదిన్నర వైవాహిక బంధం, ఊహించని సవాళ్లు, కన్నీళ్లు , నవ్వులు ఇలా జీవితంలోని ప్రతి క్షణం కూడా మమ్మల్ని మరింత దగ్గర చేసింది. ఇప్పుడు మా బంధం మరింత బలపడి.. మా కుటుంబంలోకి ఇంకొకరు వస్తున్నారు అని చెప్పడానికి మాకు మాటలు చాలడం లేదు. జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి మేము ఆసక్తిగా , ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం. మాపై మీరు చూపిస్తున్న ప్రేమకు, మద్దతుకు, దీవెనలకు అన్నింటికీ కూడా ఇవే మా ధన్యవాదాలు అంటూ రాసుకు వచ్చారు యాదమ్మ రాజు.

- Advertisement -

ఫోటోలు వైరల్..

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. యాంకర్లను మొదలుకొని తోటి కమెడియన్లు, సెలబ్రిటీలు కూడా యాదమ్మ రాజు – స్టెల్లా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. అంతే కాదు స్టెల్లా మామ్, యాదమ్మ రాజు డాడ్ హెడ్ క్యాప్ లను ధరించి, స్కానింగ్ కి సంబంధించిన ఫోటోలను చేత పట్టుకొని తాము తల్లిదండ్రులను కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈ క్యూట్ జంట ఇప్పుడు అమ్మానాన్నలు కాబోతున్నారు అని తెలిసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు