Kiraak RP: కిరాక్ ఆర్పీ ఫ్రాడ్ అంటూ బండారం మొత్తం బయటపెట్టిన జబర్దస్త్ కమెడియన్..!

Kiraak RP.. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో భాగంగా నోటి దురుసుగా సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిర్రాక్ ఆర్పి ఏ రేంజ్ లో వైరల్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రోజా, అల్లు అర్జున్, వేణు స్వామి, జగన్ లాంటి వారిని టార్గెట్ చేస్తూ ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అంతేకాదు తనకు అన్నం పెట్టిన మల్లెమాల సంస్థను కూడా విమర్శించారు. దీంతో ఆగ్రహం చెందిన కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు, సీనియర్ కమెడియన్లు కిర్రాక్ ఆర్పి పై విరుచుకుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇతడి బండారాన్ని ఒక్కొక్కటిగా బయట పెడుతూ ఇతడు పెద్ద ఫ్రాడ్ అంటూ ప్రూవ్ చేస్తున్నారు కూడా.

Kiraak RP: Jabardast comedian who exposed the entire bandaram as Kiraak RP fraud..!
Kiraak RP: Jabardast comedian who exposed the entire bandaram as Kiraak RP fraud..!

కిర్రాక్ ఆర్పీ బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్..

ఇటీవలే సీనియర్ కమెడియన్, రాజకీయ నేత బాబు మోహన్ కిర్రాక్ ఆర్పీ పై ఒక రేంజ్ లో ఫైర్ అవ్వగా ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు కూడా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిర్రాక్ ఆర్పీ..

జబర్దస్త్ షోలో కమెడియన్ చంటి టీంలో స్కిట్స్ చేస్తూ ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగి సినిమాలలో అవకాశాలు కూడా అందుకున్నాడు కిర్రాక్ ఆర్పీ. కొన్ని సినిమాలలో కామెడీ పాత్రలు కూడా చేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు రావడంతో ఆయనతో పాటే ఈయన కూడా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో రెస్టారెంట్ ఓపెన్ చేసి హైదరాబాదు తరహా పలు నగరాలలో ఈ రెస్టారెంట్ బ్రాంచ్ చేసిన ఓపెన్ చేసి బిజినెస్ చేస్తున్నాడు. ఇక బిజినెస్ చేసుకుంటూ తన పని తాను చూసుకోకుండా ఇలా రాజకీయ నేతలపై సెలబ్రిటీలపై కామెంట్లు చేయడం అందరికీ తలనొప్పిగా మారిందని చెప్పాలి.

- Advertisement -

కిర్రాక్ ఆర్పీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన షేకింగ్ శేషు..

ఇక తాజాగా కిర్రాక్ ఆర్పీ పై నటుడు కమెడియన్ షేకింగ్ శేషు మండిపడ్డారు.. అతడు ఒక ఫ్రాడ్ అంటూ ఒక నిర్మాతను పూర్తిగా ముంచేశాడు అంటూ ఫైర్ అయ్యాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షేకింగ్ శేషు మాట్లాడుతూ.. అప్పట్లో ఆర్పి ఒక సినిమా తీస్తున్న అంటూ తెగ హడావిడి చేశాడు. వేరే ప్రాంతానికి చెందిన నిర్మాతను పట్టుకున్నాడు జె.డి చక్రవర్తితో సినిమాను ఓపెన్ చేయించాడు. ఆ ఓపెన్ కి నాగబాబు కూడా వచ్చారు. పెద్ద సినిమా తీస్తున్నాడు అని మేము కూడా సంతోష పడ్డాం. అంతేకాదు హైదరాబాదులో సినిమా ఆఫీసు ఒకటి రెంట్ కు తీసుకోగా, దాని రెంట్ రూ.50,000. సినిమానే మొదలు కాలేదు. అప్పుడే నిర్మాత చేత భారీగా ఖర్చు చేయించడం మొదలుపెట్టాడు. సినిమా మొదలు పెట్టకముందే రూ .20 లక్షల బిల్లు నిర్మాత చేతిలో పెట్టాడు. ఆయన లబోదిబోమన్నాడు. నిండా ముంచేశావు నువ్వూ వద్దు నీ సినిమా వద్దు.. సినిమా మొదలు పెట్టకనే 20 లక్షల ఖర్చు చేశావంటే ఇక సినిమా మొదలు పెడితే ఇంకా ఎంత నష్టం వస్తుందో నా డబ్బులు నాకు ఇచ్చేయంటూ ఆయన గగ్గోలు పెట్టాడు.. ఇక హోమ్ టూర్ అంతా కూడా పెద్ద ఫ్రాడ్ ఎవరో ఇంటిని చూపించి నా ఇల్లు అని దాని ఖరీదు 3 కోట్లని ఇది నా బెడ్ రూమ్ అంటూ బడాయికి పోయాడు.. అది వాడి ఇల్లు కాదు ఎవరో కోటీశ్వరుడిని తన ఇల్లుగా మార్చుకొని చూపించాడు వ్యూస్ కోసం.. వాడు ఒక పెద్ద ఫ్రాడ్ అంటూ ఆర్పీ బండారాలను బయటపెట్టాడు షేకింగ్ శేషు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు