Nirupam Paritala: ఒక్కో ఎపిసోడ్ కి నిరూపమ్ ఎంత తీసుకుంటారో తెలుసా..?

Nirupam Paritala..తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలతో పాటు బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి సీరియల్స్ కు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండి పోతూ ఉంటాయి. అందుకే వీరి రెమ్యూనరేషన్ కూడా కళ్ళు చెదిరేలా ఉంటుందని చెప్పవచ్చు. ఇకపోతే డాక్టర్ బాబుగా నిరూపమ్ పరిటాల నటించిన విషయం తెలిసిందే.. కార్తీకదీపం సీరియల్స్ తో మంచి పాపులారిటీ అందుకున్నారు.

సినిమాలలో కూడా..

Nirupam Paritala: Do you know how much Nirupam takes for each episode..?
Nirupam Paritala: Do you know how much Nirupam takes for each episode..?

ఈ సీరియల్ తో ఎంతో మంది అభిమానులను డాక్టర్ బాబుగా సంపాదించుకున్న నిరూపమ్..సినిమాలలో, సీరియల్స్ లో కూడా నటించే అవకాశాన్ని సంపాదించుకున్నారు. మొదట చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమైనప్పటికీ.. కార్తీకదీపం సీరియల్ ఈయన కెరియర్ ను మలుపు తిప్పింది. మొదట హీరోగా మారాలని ఎంతో ట్రై చేసినా.. సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళిన ప్రతిసారి కూడా సీరియల్ లో నటిస్తున్నారని చాలామంది పక్కకి పెట్టేసేవారట. అది నచ్చకనే ఎన్నో సినిమాలను సైతం వదులుకున్నానని ఎన్నోసార్లు నిరూపమ్ వెల్లడించారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా ప్రేక్షకులు ఎక్కడ పోయినా కూడా డాక్టర్ బాబు గానే పిలుస్తూ ఉన్నారు.

కార్తీకదీపం తోనే సక్సెస్..ఎపిసోడ్ కి నిరూపమ్ రూ.45 వేలు

గతంలో ఎన్నో సీరియల్స్ లో నటించిన నిరూపమ్. ఆ సీరియల్స్ కు టీఆర్పి రేటింగ్ కూడా పెద్దగా రాలేదట. కానీ కార్తీక దీపం సీరియల్ తన జీవితాన్నే మార్చేసింది. దీంతో బుల్లితెర పైన మెగాస్టార్ గా కూడా పేరు సంపాదించారు నిరూపమ్.. ఈ మధ్యనే కార్తీక దీపం-2 సీరియల్ కూడా ఎంట్రీ ఇచ్చినా .. పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది. ఇకపోతే ఈయన పారిపోషకం విషయానికి వస్తే.. గతంలో ఒక్కో సీరియల్ ఎపిసోడ్ కి రూ.22,000 తీసుకునే వారట.. కానీ కార్తీకదీపం ఇచ్చిన సక్సెస్ తో ఏకంగా ఒక్కో ఎపిసోడ్ కి నిరూపమ్ రూ.35 వేల నుంచి 45 వేల రూపాయల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -

రూ.15 కోట్లకు పైగా ఆస్తి..

ఇప్పటివరకు సీరియల్ హీరోలలో ఇంత మొత్తం అందుకోవడం ఇదే మొదటి సారి అని బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు రెండు మూడు సీరియల్స్ షూటింగ్ కూడా ఒకేసారి జరుగుతూ ఉంటుందట. ఇలాంటి సమయంలో ఆదాయం లక్షకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అలాగే నిరూపం రెమ్యూనరేషన్ విషయంలోనే కాకుండా.. ఆస్తులలో కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది. సుమారుగా 15 కోట్ల రూపాయలకు పైగా నిరూపమ్ ఆస్తులు , పొలాలు అన్నీ ఉన్నట్లు సమాచారం. ఇవే కాకుండా నిరూపమ్ నిర్మాతగా కూడా మారినట్లు తెలుస్తోంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న హిట్లర్ గారి పెళ్ళాం అనే నాటికకు నిరూపమ్ నిర్మాతగా వ్యవహరించారట. నిరూపమ్ భార్య మంజుల కూడా వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. ఇలా ఇద్దరు కూడా రెండు చేతులా భారీ మొత్తంలో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు