Polimera 2 : బుల్లితెర పై కూడా మంచి రెస్పాన్స్ రాబట్టింది

Polimera 2 : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాలతో పాటు. చిన్న సినిమాలు కూడా మంచి పేర్లు సాధిస్తున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఎన్నో సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. కరోనా టైంలో డైరెక్ట్ గా ఓటీటీలోకి రిలీజ్ అయిన చాలా సినిమాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేకపోతే సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా పొలిమేర. ఈ సినిమా హాట్స్టార్ లో విడుదలైంది. అయితే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత దీని సెకండ్ పార్ట్ ని థియేటర్లోకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.

పొలిమేర సినిమా హిట్ అవడంతో పొలిమేర 2 సినిమా అని బడ్జెట్ పెంచి తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ సాధించుకుంది. సత్యం రాజేష్ కామాక్షి భాస్కర్ పట్ల గెటప్ శీను వంటి ఎందరో గుర్తింపు పొందిన నటులు ఈ సినిమాలో కనిపించారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది. దర్శకుడు అనిల్ ఈ సినిమాను ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా నడిపాడు. అయితే ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించింది.

Maa Oori Polimera

- Advertisement -

ఈ సినిమా ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయ్యింది. ఈ సినిమాకి వచ్చిన టీఆర్పీ రేటింగ్ తాజాగా బయటపడింది. ఈ ఈ సినిమా బుల్లితెర పై కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకి 6.21 టీఆర్పీ రేటింగ్ విశేషం. ఈ సినిమా చేతబడి, మూఢనమ్మకాలు నేపథ్యంలో జరిగే పరిణామాలను చూపించింది. ఇకపోతే ఈ సినిమాకి కొనసాగింపుగా పొలిమేర 3 చేసే అవకాశం కూడా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు