Singer Smita : టీఆర్పీ కోసమే..

ప్రస్తుతం టెలివిజన్ లో ఎక్కువగా కనిపిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. హాలీవుడ్ లో పరిచయమైన ఈ రియాలిటీ షో అన్ని దేశాలకు పాకింది. మన దేశంలో ముందుగా బాలీవుడ్ లోకి వచ్చిన ఈ షో, క్రమంగా అన్ని భాషలకు చేరింది. తెలుగులో ఇప్పటికే ఐదు సీజనులు, ఒక ఒటీటీ సీజన్ ను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం, ఆరో సీజన్ నడుస్తుంది. ఈ ఆరో సీజన్ ఈ నెల 4వ తేదీ నుండి స్టార్ మాలో ప్రసారం అవుతుంది. అయితే ప్రతి సంవత్సరం బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యే సమయంలో, దీన్ని వ్యతిరేకించే వాళ్లు, సపోర్టు చేసేవాళ్లు పలు వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఇప్పటికే బిగ్ బాస్ షో పై కమ్యునిస్ట్ నాయకుడు నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. బూతు షో అంటూ విరుచుపడ్డారు. కాసులకు కక్కుర్తి పడేవాళ్లు ఉన్నంత కాలం ఇలాంటి షోలు ఉంటాయని ఆయన మండిపడ్డారు. తాజాగా మరొకరు బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పాప్ సింగర్ స్మిత ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో పై ఘాటుగా స్పందించారు.

”బిగ్ బాస్ షో నాకు అసలు నచ్చదు. ఒక వేళ నాకు ఆ షోలోకి వెళ్లే అవకాశం వస్తే, పోరపాటున కూడా వెళ్లి తప్పు చేయను. అన్ని రోజులు నా కుటుంబాన్ని వదిలి ఉండాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఈ షోకి వెళ్తున్నారని తెలిస్తే, దీని వల్ల మీకు ఏం వచ్చింది అని ప్రశ్నిస్తా. కొంత మందిని ఒక ఇంటికి పంపించి, మీరు తన్నుకోండి మేము టీఆర్పీలు తెచ్చుకుంటాం అన్నట్లు ఈ షో ఉంటుంది. ఈ షో నేను చూడను. చూసినా అర్థం కాదు. నాకు ఇష్టమైన వాళ్లు ఆ షోకి వెళ్లారు. ఇప్పుడు ఏది మాట్లాడినా వాళ్లను విమర్శిచినట్లు అవుతుంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడను” అంటూ స్మిత అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు