Bigg Boss : స్టార్ సింగర్ కన్ఫామ్

మోస్ట్ అవైటెడ్ తెలుగు టెలివిజన్ షో బిగ్ బాస్ రేపటి నుంచి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు సిజన్లు, ఒక ఓటీటీ సీజన్ ను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. రేపటి నుండి ఆరో సీజన్ ప్రసారం కానుంది. స్టార్ మాలో ప్రతి రోజు ఒక గంట టెలికాస్ట్ కాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు ప్రసారం కానుందని తెలుస్తుంది. కాగా ఆరో సీజన్ కు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు బయటకు రాగా, తాజాగా బిగ్ హౌస్ ను కూడా చూపిస్తూ ఒక వీడియోను వదిలారు. ప్రతి సీజన్ తో పోల్చుకుంటే, ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ కొత్తగా కనిపిస్తుంది. హౌస్ డిజైన్ ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.

అయితే ఈ ఆరో సీజన్ లో ఎంత మంది కంటెస్టెంట్లు ఉండబోతున్నారు. ఎవరెవరు రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేది వీళ్లే అంటూ ఒక లిస్ట్ కూడా చక్కర్లు కొడుతుంది. యూట్యూబ్ యాంకర్ రోషన్, సింగర్ మోహనా భోగరాజు, నటుడు లక్ష్య చదలవాడ, జబర్దస్త్ ఫేం తన్మయ్,
నటి సంజనా చౌదరి, నటుడు భరత్, హీరో సుమంత్ అశ్విన్ తో పాటు ఇండియన్ ఐడల్ సీజన్ 9 విన్నర్ రేవంత్ కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

తాజాగా సింగర్ రేవంత్ ట్విట్టర్ చూస్తే, రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినట్లు మనకు తెలుస్తుంది. రేవంత్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇలా ఉంది.. ‘ కొన్నింటిని వదులుకోవడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా నా భార్యను, మ్యూజిక్ ను చాలా మిస్ అవుతున్నా. కానీ ఒక భగీరథుడిలా గెలిచి బయటకి వస్తా.. మీ అందరి సపోర్ట్ ఓట్ల రూపంలో కావాలి. నా నుండి కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ ఇస్తా. మీ బ్లేసింగ్స్ తో టైటిల్ గెలిచి వస్తా. అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు బిగ్ బాస్ సీజన్ 6 అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. దీంతో సింగర్ రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినట్లు స్పష్టమవుతుంది.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు