Producer : వడ్డీ వ్యాపారుల వేధింపులు… పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ప్రముఖ నిర్మాత

Producer : సినిమాల కోసం కోట్లు కోట్లు అప్పులు చేసి మరీ కుమ్మరిస్తున్న నిర్మాతలు అవి డిజాస్టర్ కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ భర్త, మామ తమ నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు డిజాస్టర్ కావడంతో వందల కోట్ల అప్పుల్లో కూరుకుపోయారు. వాటిని తీర్చడానికి ఏకంగా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ అప్పులు తీరలేదు. తాజాగా మరో నిర్మాతకు అప్పుల వాళ్ళు పీక మీద కత్తి పెట్టినంత పని చేయడంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.

శాండల్‌వుడ్ నిర్మాతకు కష్టాలు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన శాండల్‌వుడ్ నిర్మాతకు వడ్డీ వ్యాపారుల నుంచి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. ఆ వేధింపులతో విసిగిపోయిన ‘కిరిక్ పార్టీ’ చిత్ర నిర్మాత పుష్కర్ మల్లికార్జునయ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. కన్నడ సినీ ప్రముఖ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య పదికి పైగా సినిమాలను నిర్మించారు. అందులో రక్షిత్ శెట్టి నటించిన కిరిక్ పార్టీ ఒకటి. అలాగే అవనే శ్రీమన్నారాయణ, అవతార పురుషుడు, అవతార పురుషుడు పార్ట్ 2 చిత్రాలను నిర్మించిన నిర్మాత పుష్కర్ మల్లికార్జునయ్య కొన్ని సినిమాల వల్ల ఆర్థికంగా నష్టపోయారని సమాచారం. దీంతో అప్పుల బాధ పెరిగింది.

Pushkara Mallikarjunaiah

- Advertisement -

5 కోట్ల అప్పు చేసిన నిర్మాత

నిర్మాత పుష్కర్ నిర్మించిన మూడు సినిమాలు పరాజయం పాలవడంతో భారీ నష్టం వాటిల్లింది. అందులో ఓ సినిమాను నిర్మించడానికి5 కోట్ల వడ్డీ తీసుకున్నాడట. ఆ 5 కోట్లకు వడ్డీ, చక్రవడ్డీతో కలిపి 11 కోట్లు లెక్క అయ్యిందట. అయితే ఈ మొత్తంతో కలిపి మరో పదమూడు కోట్లు చెల్లించాలని వడ్డీ వ్యాపారులు నిర్మాతను వేధిస్తున్నట్లు సమాచారం.

నిర్మాత పుష్కర్‌కు ప్రాణహాని

నిర్మాత పుష్కర్ కు అప్పు ఇచ్చిన వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారట. దీంతో పుష్కర్‌ నిర్మాతల సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ కిషోర్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కేసు సీసీబీ పోలీసులకు చేరడంతో మనీలాండరింగ్ సెక్షన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

5 కోట్ల అప్పుకి 11 కట్టాడు

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నిర్మాత పుష్కర్ మల్లికార్జున ఆదర్శ్, హర్ష, శివ, హర్ష డి నుంచి సినిమా నిర్మాణం కోసం ఐదు కోట్ల అప్పు తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పును వడ్డీతో కలిపి 11 కోట్లు కట్టేశాడట. అయినప్పటికీ వాళ్ళు ఇంకో 13 కోట్లు కట్టాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

4 కోట్ల సినిమాకు 50 కోట్లు

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ చిత్రం రక్షిత్ శెట్టిని ఇన్‌స్టంట్ స్టార్‌గా మార్చింది. తొలి సినిమాతోనే రష్మిక విజయం సాధించింది. ఈ సినిమా బడ్జెట్ కేవలం 4 కోట్ల రూపాయలు. కానీ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 4 కోట్ల సినిమా 50 కోట్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయి. రక్షిత్ శెట్టి, పుష్కర్ మల్లికార్జునయ్య, జిఎస్ గుప్తా ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు