Bharateeyudu2 PreReleaseEvent : ఉలగనయగన్ కమల్ హాసన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్2 వచ్చేవారం జులై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక ఇండియన్2 శంకర్ షణ్ముగం కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కడం జరిగింది. ఇక ఈ సినిమా తెలుగులో భారతీయుడు2 పేరుతో విడుదల కానుంది. ఇదిలా ఉండగా భారతీయుడు2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగడం జరిగింది. ఈ ఈవెంట్ కి కమల్ హాసన్ సహా చిత్ర యూనిట్ మొత్తం హాజరవడం జరిగింది. అయితే ఇండియన్2 తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా రోజుల క్రితమే జరగగా, తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ (Bharateeyudu2 PreReleaseEvent) ఇప్పుడు జరిగింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలువురు సెలెబ్రటీలు మాట్లాడిన స్పీచ్ లు హైలెట్ గా మారాయి.
ఆ సినిమా వల్లే లాల్చీ పైజామా వేయడం మొదలెట్టా – సుద్దాల అశోక్ తేజ
ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారతీయుడు2 సినిమాకి పాటలు రాసిన రచయితలు సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, రామజోగయ్య శాస్త్రి కూడా ఈ వేడుకకి హాజరవడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో సుద్దాల అశోక్ తేజ మాట్లాడిన స్పీచ్ వైరల్ గా మారింది. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ ముందుగా అందరికి నమస్కారం చెప్తూ.. ఈ సినిమాలో “సౌరా” అనే పాటను రాసాను. అందుకు అవకాశం ఇచ్చిన శంకర్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అన్నాడు. అలాగే శంకర్ తీసిన శివాజీ, రోబో, సినిమాలకు కూడా పాటలు రాసాను అని సుద్దాల అశోక్ చెప్పుకొచ్చారు.
ఇక కమల్ హాసన్ గురించి సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ, ఆయనకు అంతులేని కథ సినిమా నుండి అభిమానులం… కమల్ హాసన్ ప్రతి సినిమాను చూస్తాం అంటూ.. కమల్ హాసన్ సాగర సంగమం సినిమా నా లైఫ్ స్టైల్ ని మార్చేసింది అంటూ సుద్దాల అశోక్ తేజ అన్నారు. కమల్ హాసన్ సాగర సంగమం సినిమాలో వేసిన లాల్చీ పైజామా చూసి, నేను కూడా ఇప్పటివరకూ లాల్చీ, పైజామా, చుడిదార్ వంటివి వేయడం స్టార్ట్ చేసాం అని సుద్దాల అశోక్ తేజ చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా అలంటి వేషధారణనే కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు. ఇక ఈ సినిమాలో రాసిన “శౌరా” సాంగ్ లో కొత్తగా తెలుగు పదాలని వాడడం జరిగిందని, ఇప్పటివరకు ఏ డబ్బింగ్ సినిమాకు అలా రాయలేదని చెప్పుకొచ్చారు.