Bollywood: ప్రభాస్ కంటే షారుక్ ఖాన్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారా..?

అవును.. ఇటీవలి కాలంలో సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషకం తీసుకునే హీరో ఎవరనే చర్చ నడుస్తోంది. వరుసగా రెండు సినిమాలతో బాలీవుడ్ హీరోల రికార్డులను తుడిచి పెట్టేసాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి 2 బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దాదాపు 1000 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో కూడా 170 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక సౌత్ హీరో బాలీవుడ్ లో ఇంత సంచలనం సృష్టించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. ఈ సినిమాల తరువాత రెమ్యూనరేషన్ పరంగా ప్రభాస్ టాప్ హీరోగా నిలిచాడు. బాహుబలి తర్వాత తన మిగతా సినిమాలన్నింటికీ ప్రభాస్ రూ. 140 – 150 కోట్ల మధ్య వసూలు చేస్తున్నారని టాక్.

ఇక అక్షయ్ కుమార్, పవన్ కళ్యాణ్, దళపతి విజయ్, మహేష్ బాబు, వంటి పెద్ద పెద్ద స్టార్లు రూ. 70 – 100 కోట్ల మధ్య పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దాదాపు పదేళ్ల పాటు నిఖార్సయిన హిట్ లేకపోవడం, పఠాన్ సినిమాతో మళ్లీ షారుక్ ఖాన్ ఫామ్ లోకి రావడం, రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడం తెలిసిందే. పఠాన్ చిత్రం హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూలు సాధించి మళ్లీ షారుఖ్ ఖాన్ ని నెంబర్ వన్ స్థానంలో నిలపడమే కాకుండా.. హిందీ సినిమా పరిశ్రమకు ఊపిరి పోసింది.

అయితే బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న నివేదికల ప్రకారం షారుక్ ఖాన్ ఈ సినిమా కు రెమ్యూనరేషన్ గా దాదాపు రూ. 200 కోట్లు తీసుకుంటున్నారట. ఈ లెక్కన ప్రభాస్ ని దాటినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ఇప్పుడు మారిపోయారు. అయితే “ప్రాజెక్ట్ కే” కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ కూడా రూ. 200 కోట్ల రెమ్యూనరేషన్ రికార్డుని బ్రేక్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు