OG : పవన్ కళ్యాణ్ కొత్త మూవీ టీజర్ అప్డేట్

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తోన్న సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్ “. మైత్రి మూవీస్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ తొందరలోనే స్టార్ట్ అవబోతుంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, రెండు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ , మూడోది యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో OG సినిమా చేస్తున్నారు. ఇవి మూడు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఏడాది కావొస్తున్న సినిమా మాత్రం కంప్లిట్ అవ్వలేదు. సినిమా ఎనౌన్స్ చేసిన మొదట్లో చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసిన మూవీ టీం ఆ తరువాత నుంచి ఈ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా షూట్ లెట్ అవుతూ వస్తుండటం వల్ల పవన్ ఈ సినిమాని తాత్కాలింగా ఆపేసి OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకి డేట్స్ కేటాయించారు.

అయితే OG సినిమా చేసింది ఒక షెడ్యూలే అయిన సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ , అప్డేట్స్ మావి టీం కంటిన్యూగా ఇచ్చారు.దాని వాళ్ళ OG సినిమాకి మంచి బజ్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ ముందు మొదలైన OG కి బజ్ ఎక్కువడంతో ఫీల్ అయిన హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఏకంగా టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ వేసాడు. అందుకే వెంటనే ఎడిటింగ్ స్టార్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. ఇప్పటికే పుష్ప , మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాల అప్డేట్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుండట తో ఉస్తాద్ టీజర్ చేసి బజ్ క్రియేట్ చేయాలనీ ఫిక్స్ అయ్యారంట హరీష్ శంకర్. మే 11 న ఉస్తాద్ టీజర్ ఎట్టి పరిస్థితులలో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారంట.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు