Pushpa: యూట్యూబ్ లో సెంచరీ కొట్టేసేన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో లో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2021 డిసెంబర్ 17 న పాన్ ఇండియా మూవీ గా వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఈ మూవీ తో స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ గా మారాడు. అంతవరకు తెలుగు ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకున్న అల్లు అర్జున్, ఈ సినిమా తో నేషనల్ వైడ్ గా తన క్రేజ్ ని రెట్టింపు చేసుకున్నాడు. ముఖ్యంగా హిందీ లో ఈ సినిమా ఇరగదీసింది. అక్కడ 100 కోట్లకి పైగా వసూలు చేసింది.

“పుష్ప ది రైజ్ మూవీ” ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న కి పుష్ప ద్వారా నేషనల్ క్రష్ గా పేరొచ్చింది. ఇక ఈ సినిమాకు రెండో భాగం 2024 లో రాబోతుంది. అయితే ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా వచ్చిన టీజర్ పుష్ప ది రూల్. మూడు నిమిషాలతో వదిలిన ఈ వీడియో లో పుష్ప చివర్లో మాత్రమే కనిపిస్తాడు. అయితే ఈ టీజర్ తో పుష్ప 2 కోసం ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో తెలిసింది.

తాజాగా “పుష్ప ది రూల్” టీజర్ 100 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసింది. తెలుగు కంటే హిందీ వెర్షన్ టీజర్ కి ఎక్కువ వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ సినిమా మొదటి భాగం పుష్ప ది రైజ్ వరల్డ్ వైడ్ గా 360 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు పుష్ప ది రూల్ దాదాపు 1000 కోట్లు వసూలు చెయ్యొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు