Varuntej: మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా..?

ఇటీవలి కాలంలో కుల ప్రస్తావనలు అధికం అయ్యాయి. ప్రతి సంఘటనకు కులం రంగు పులుముకోవడం ఆనవాయితీగా మారింది. అయితే కులాభిమానం, కుల ప్రస్తావన తప్పు కాకపోయినప్పటికీ.. ఆ కారణంగా విద్వేషాలు రగులుకొనే పరిస్థితులు ఉత్పన్నం అయితే అది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఐతే తెలుగు హీరోలకు కులాల వారిగా కూడా అభిమాన సంఘాలు ఉండడం మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. కొత్తగా ఏ హీరో కాస్త పాపులర్ అయినా సరే అతని కులగోత్రాలు తెలుసుకునే పనిలో ఫ్యాన్స్ ఉంటారు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మెగా ఇంటికి కోడలిగా వచ్చే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని ఎవరూ వదులుకోరనే సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ తో ఎంగేజ్మెంట్ తరువాత లావణ్య త్రిపాఠి క్యాస్ట్ గురించి గూగుల్ లో తెగ వెతికేస్తున్నారట. ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి అయి ఉంటే ఎప్పుడో ఆమె జాతకం అంతా తెలుసుకునే వాళ్ళు. కానీ బయట నుండి రావడంతో ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు కాపు కులానికి చెందిన వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం జరగడంతో లావణ్య కులం పై అందరిలో ఆసక్తి నెలకొంది.

లావణ్య గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. లావణ్య యూపీ కి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమె డెహ్రాడూన్ లో పెరిగింది. లావణ్య తండ్రి హైకోర్టు న్యాయవాది కాగా.. తల్లి రిటైర్డ్ టీచర్. ఈమెకి ఓ చెల్లి, సోదరుడు ఉన్నారు. అయితే బ్రాహ్మణురాలే అయినా.. కులాల పట్టింపు తనకి లేవని.. ఏ వ్యక్తి అయినా వాళ్ళు చేసే పనుల వల్ల గొప్ప వాళ్ళు అవుతారు అని.. కులం వల్ల కాదు అని గతంలో లావణ్య చెప్పిన వ్యాఖ్యలు లావణ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

ఇటు మెగా ఫ్యామిలీకి కూడా కులాల పట్టింపు లేదన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తాను పెళ్లి చేసుకున్న మాజీ భార్య రేణు దేశాయ్ మరాఠి కుటుంబానికి చెందిన మహిళ కాగా, అన్న లేజ్నోవా ఆస్ట్రేలియా కి చెందిన విదేశీయురాలు. ఇక రామ్ చరణ్ పెళ్లి చేసుకున్న ఉపాసన కామినేని రెడ్డి కులానికి చెందిన వారు. ఇప్పుడు తాజాగా లావణ్య కూడా వేరే కులానికి చెందిన అమ్మాయే కావడం గమనార్హం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు