Varun Tej: ఎంగేజ్మెంట్ పై స్పందించని మెగా ఫ్యామిలీ – వాళ్లకి ఇష్టం లేదా..?

టాలీవుడ్ తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. గత కొంత కాలంగా గాసిప్ గా ఉన్న వార్త, ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వటంతో కన్ఫార్మ్ అయ్యింది. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ పట్ల మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో, మెగా ఫామిలీ నుండి ఈ ఫంక్షన్ పై ఎలాంటి స్పందన లేకపోవటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దీంతో వరుణ్ తేజ్, లావణ్యల పెళ్ళికి మెగాఫ్యామిలీ పెద్దలు ఒప్పుకోలేదు అన్న అనుమానాలు మొదలయ్యాయి. కనీసం లావణ్యతో క్లోజ్ గా అయ్యే నిహారిక నుండి కూడా విషెష్ కానీ ఎలాంటి స్పందన కానీ లేకపోవటం అనుమానాలకు బలం చేకూర్చుతోంది.

అయితే, మెగా ఫామిలీ సైలెన్స్ వెనక వేరే కారణం ఉండచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ ఫంక్షన్ ని ఎలాంటి హంగు ఆర్భాటాలు, హడావిడి లేకుండా సింపుల్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరపాలని డిసైడ్ అవ్వటం వల్ల ఈవెంట్ గురించి డీటెయిల్స్ కూడా పెద్దగా బయటికి రాలేదని అంటున్నారు. ఈవెంట్ గురించి ముందుగానే ప్రచారం జరిగితే అభిమానుల తాకిడి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి సమాచారం లేకుండా సీక్రెట్ గా ఉంచారని తెలుస్తోంది.

తమ అభిమాన హీరో ఒక ఇంటివాడు అవుతున్నాడన్న వార్త మెగా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. టాలీవుడ్ కి పరిచయమై చాలా కాలం అవుతున్నా కూడా టాప్ హీరోయిన్ పొజిషన్ కి చేరుకోలేని లావణ్య వరుణ్ తో పెళ్లి తర్వాత ఆ పొజిషన్ కి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. వరుణ్, లావణ్య కలిసి ఎక్కడ కనిపించినప్పటికీ, నిహారిక, లావణ్యలు కలిసి జిమ్ కి వెళ్ళటం లాంటి సందర్భాలు మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటోంది అని సంకేతాలు ఇచ్చాయి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ కన్ఫార్మ్ అవ్వటంతో లావణ్య మెగా ఇంటికి కోడలుగా మారనుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు