Vaishnav tej: డేటింగ్ లో ఉన్న కృతి శెట్టి..!

ఈ తరం హీరోయిన్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు. లవ్, డేటింగ్ విషయంలో అసలు మొహమాట పడకుండా నిజాలను బయటపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి కూడా తన లవ్, డేటింగ్ విషయం గురించి చాలా తెలివిగా చెప్పుకొచ్చింది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య వరుస ఫ్లాప్ సినిమాలను మూటగట్టుకొని లక్కీ లెగ్ కాస్త.. ఐరన్ లెగ్ అనిపించుకుంది.

ఇప్పుడు తమిళ్, మలయాళ ఇండస్ట్రీలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది కృతి శెట్టి. అలాగే శర్వానంద్ సినిమాలో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టిని మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా..? అని అడిగారు యాంకర్. దీనికి ఆమె చాలా తెలివిగా.. ప్రస్తుతం నేను సినిమాలతో ప్రేమ, షూటింగ్ లతో డేటింగ్ చేస్తానంతే.. నా తల్లిదండ్రులను తప్ప నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదని చెప్పుకొచ్చింది.

ఇక ఆమెకి చదువుకునే రోజులలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయని.. కానీ వాటిని అంతగా పట్టించుకోలేదని తెలిపింది. ప్రేమ చాలా స్వచ్ఛమైనదని.. తాను ఇప్పటివరకు తన తల్లిదండ్రుల నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందానని తెలిపింది. ఇలా కృతి శెట్టి చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్స్ స్పందిస్తూ.. అందరూ ముందు ఇలానే అంటారని.. ఆ తర్వాత ఎవరికో ఒకరికి పడతారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు