Krithi Shetty: బోల్డ్ సీన్స్ చేస్తే.. డబుల్ రెమ్యునరేషన్స్ ?

హీరోయిన్ కృతి శెట్టి, ‘ఉప్పెన’ సినిమా ద్వారా పరిచయమైన కన్నడ బ్యూటీ నటించిన తొలి సినిమాతోనే యువత మది దోచుకొని టాప్ హీరోయిన్ రేంజ్ సాధించింది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అంతటి రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ‘శ్యామ్ సింగరాయ్’ హిట్ అయినప్పటికీ కృతి అందులో సెకండ్ హీరోయిన్ అవ్వటంతో క్రెడిట్ దక్కలేదు. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అడపాదడపా రొమాంటిక్ సీన్స్ లో నటించినప్పటికీ ఎక్స్పోజింగ్ దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కృతి తన నెక్స్ట్ సినిమాలో బికినీలో కనిపించి అలరించనుందట.
అయితే, బికినీలో కనిపించేందుకు ఈ కృతి శెట్టి భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ అందుకోనుందట. ఇందుకు గాను నిర్మాతలు ఆమెకు డబుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం నాగచైతన్యతో చేస్తున్న కస్టడీ మినహా చేతిలో ఆఫర్లు లేకపోవటం వల్లే కృతి ఇందుకు ఒప్పుకుందని అంటున్నారు. తొలి సినిమాతోనే ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ కుర్ర హీరోయిన్, ఆ క్రేజ్ ను సద్వినియోగం చేసుకోలేకపోయింది. వస్తున్న వార్తలు నిజమైతే, కృతి బికినీలో తన అందాలను వెండితెరపై ఆరబోసి థియేటర్లలో హీట్ పెంచే రోజు తావరలోనే రాబోతుంది అన్నమాట.
కృతి బికినీ ప్రయోగం గనక సక్సెస్ అయితే వరుసగా అలాంటి ఆఫర్స్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న కృతి ఇప్పుడు ఆఫర్లు లేక బికినీ సీన్ కి ఒక చెప్పటం చూస్తుంటే ఇక మీదట తన నుండి బోల్డ్ క్యారెక్టర్స్ ఆశించవచ్చు అన్న సంకేతాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. మరి, వస్తున్న రూమర్స్ నిజమో కాదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు